Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laughing Snake video :స్మైల్ ఇచ్చే స్నేక్‌ను ఎప్పుడైనా చూశారా..? కిత కితలకు పగలబడి నవ్వుతోంది..

పాము ఇలా నవ్వుతున్న వీడియోను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయగా, అది వైరల్‌ అవుతోంది. వీడియోని మిలియన్లకు జనాలు వీక్షించారు. వేల మంది లైక్ చేశారు. కొన్ని సెకన్ల ఈ వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపించే పాము చిరునవ్వు చూడటం నిజంగా సరదాగా ఉంటుంది. అయితే, ఈ పాము

Laughing Snake video :స్మైల్ ఇచ్చే స్నేక్‌ను ఎప్పుడైనా చూశారా..? కిత కితలకు పగలబడి నవ్వుతోంది..
Laughing Snake
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 12, 2023 | 7:18 AM

సోషల్ మీడియాలో రకరకాల వింత వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి. ఇది ఒత్తిడితో కూడిన జీవితంలో ఒత్తిడిని మరచిపోవడానికి, సంతోషానికి సహాయపడుతుంది. ఇటీవలి కాలంలో ఇంటర్నెట్‌లో పాముల వీడియోలు బాగా హల్‌చల్ చేస్తున్నాయి. ఇంటర్నెట్ ప్రపంచం ఒక వింత ప్రదేశం. నిజజీవితంలో చూడలేని ఎన్నో విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం చూసే కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నమ్మడం కూడా అసాధ్యంగా అనిపిస్తుంది.. కానీ, సోషల్ మీడియా అంటేనే వింతలు విశేషాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనే చెప్పాలి. ఇంటర్‌నెట్‌ నిండా ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా మనం కూడా ఈ వింతలను దగ్గరగా చూడగలుగుతున్నాం. మనం చూసే చాలా విషయాలు కొన్నిసార్లు మనల్ని నవ్విస్తాయి, కొన్నిసార్లు మనల్ని ఆలోచింపజేస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో పాముకు సంబంధించినది. ఈ పాము వీడియో చూస్తే మీకు సంతోషం, ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ పాము నవ్వుతుందట.

బుసలు కొట్టే పాములు తెలుసు.. కానీ స్మైల్ ఇచ్చే స్నేక్‌ను ఎప్పుడైనా చూశారా? అదేంటి పాము నవ్వటం ఏంటని నిజంగానే ఆశ్చర్యపోతున్నారు కదా..! కానీ, మీరు విన్నది నిజమే..వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక పాము నేలపై పాకడం కనిపిస్తుంది. పాము పాకుతున్నప్పుడు ఒక వ్యక్తి దాని శరీరాన్ని వేలితో తాకుతున్నాడు.. ఆ పామును తాకిన వెంటనే పాము చక్కిలిగింతలా స్పందిస్తుంది. పాకుతున్న పాము భూమిపై పొర్లుతుంది. అంతేకాదు..ఆ పాము నోరు తెరిచి బిగ్గరగా నవ్వుతున్నప్పుడు దాని ప్రతిచర్య మనకు వీడియోలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

పాము ఇలా నవ్వుతున్న వీడియోను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయగా, అది వైరల్‌ అవుతోంది. వీడియోని మిలియన్లకు జనాలు వీక్షించారు. వేల మంది లైక్ చేశారు. కొన్ని సెకన్ల ఈ వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపించే పాముల చిరునవ్వు చూడటం నిజంగా సరదాగా ఉంటుంది. అయితే ఈ పాము ఎక్కడిది..? ఎలాంటి ? ఇది విషపూరితమైనదా అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి