Love Proposal Video: లైవ్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్.. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన జంట.. వైరల్ వీడియో..

Proposal during WTC Final 2023: భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో రోజు, భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగింది. ఇంతలో స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని తన స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన సందర్భాన్ని కెమెరాలో చూపించారు. అయితే, ప్రియుడి ప్రపోజ్‌కు ఒప్పుకున్న ప్రియురాలు.. సంతోషంలో మునిగిపోయింది.

Love Proposal Video: లైవ్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్.. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన జంట.. వైరల్ వీడియో..
Proposal During Wtc Final
Follow us
Venkata Chari

|

Updated on: Jun 11, 2023 | 7:24 PM

Proposal during WTC Final 2023: లండన్‌లోని కింగ్‌స్టన్ ఓవల్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు రోజుల ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ముగిసింది. వరుసగా రెండోసారి టీమిండియాకు చేదు ఫలితమే ఎదురైంది. అయితే, ఈ మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు పలువురు అభిమానులు స్టేడియంకు చేరుకున్నారు. కాగా, మ్యాచ్ నాలుగో రోజు స్టేడియంలో ఓ జంట చేసిన హాడావుడి ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో లైవ్ మ్యాచ్‌లో ఈ జంట ముద్దులు, హగ్గులతో తమ స్పెషల్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.

లైవ్ మ్యాచ్‌లో ప్రియురాలికి ప్రపోజ్.. ముద్దులతో సెలబ్రేషన్స్..

భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో రోజు, భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగింది. ఇంతలో స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని తన స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన సందర్భాన్ని కెమెరాలో చూపించారు. అయితే, ప్రియుడి ప్రపోజ్‌కు ఒప్పుకున్న ప్రియురాలు.. సంతోషంలో మునిగిపోయింది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత యువకుడు తన ప్రేయసికి ఉంగరం తొడిగాడు. అనంతరం ఇద్దరూ ముద్దులతో తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. పక్కనే ఉన్న అభిమానులు వీరిద్దరి ఆనందాన్ని ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..