AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్స్‌.. ధర ఎంతో తెలిస్తే నిజంగానే ఫ్యూజులు అవుట్..

కొంతమంది ఎప్పుడూ బ్రాండ్ బ్రాండ్ అంటూ చెబుతుంటారు. ఏది కొన్నా.. ఇది బ్రాండ్ గురూ అంటూ చూపెడుతుంటారు. అలాంటి వారిలో ఖరీదైన హెడ్ ఫోన్స్ కొనే వారు కూడా ఉన్నారు. ఖరీదైనవి అంటే వందలు, వేలు మాత్రమే.. కోట్లు విలువచేసే ఖరీదైనవి కూడా కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వారికోసం పలు కంపెనీలు కూడా అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్స్‌ని తయారు చేస్తుంటాయి.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్స్‌.. ధర ఎంతో తెలిస్తే నిజంగానే ఫ్యూజులు అవుట్..
World Most Expensive Headph
Jyothi Gadda
|

Updated on: Jun 12, 2023 | 11:31 AM

Share

కోటి రూపాయల విలువైన కారు, విలాసవంతమైన భవంతి లభిస్తే సకల సౌకర్యాలతో హాయిగా జీవితాన్ని గడపవచ్చని ఆశిస్తుంటాం. అయితే, కొంతమంది ఎప్పుడూ బ్రాండ్ బ్రాండ్ అంటూ చెబుతుంటారు. ఏది కొన్నా.. ఇది బ్రాండ్ గురూ అంటూ చూపెడుతుంటారు. అలాంటి వారిలో ఖరీదైన హెడ్ ఫోన్స్ కొనే వారు కూడా ఉన్నారు. ఖరీదైనవి అంటే వందలు, వేలు మాత్రమే.. కోట్లు విలువచేసే ఖరీదైనవి కూడా కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వారికోసం పలు కంపెనీలు కూడా అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్స్‌ని తయారు చేస్తుంటాయి. ఈ కారణంగా రూ. 6.19 కోట్ల ధర హెడ్‌ఫోన్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్స్ ఏంటో తెలుసా?

Most Expensive Headph

Most Expensive Headph

రూ. 6.19 కోట్ల విలువైన హెడ్‌ఫోన్స్‌:

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్ బీట్స్ ప్రో , దీని ధర రూ. 6.19 కోట్లు. దీని తయారీకి 6.5 క్యారెట్ల బంగారం, కెంపులను ఉపయోగించి తయారు చేశారు. దీంతో పాటు ప్లాటినం కూడా ఈ హెడ్‌ఫోన్స్‌ తయారీలో ఉపయోగించారు. దీనిని లండన్‌లోని ఒక ఆభరణాల కంపెనీ తయారు చేసింది.

18 క్యారెట్ గోల్డ్ హెడ్‌ఫోన్‌లు:

రెండవ అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్ `ఫోకల్ య్టోపియా` దీని ధర సుమారు రూ. 88 లక్షలు. ఇందులో 18 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

Onkyo H900M హెడ్‌ఫోన్:

మూడవ అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్ Onkyo H900M డైమండ్. దీని తయారీకి 20 క్యారెట్ల వజ్రాన్ని ఉపయోగించారు. దీని ధర సుమారుగా 100,000 డాలర్లు అంటే దాదాపు 82 లక్షల రూపాయలు.

43 లక్షల హెడ్‌ఫోన్‌లు:

ఖరీదైన హెడ్‌ఫోన్‌ల జాబితాలో నాల్గవ పేరు సెన్‌హైజర్ బ్రాండ్‌కు చెందినది. దీని పేరు “సెన్‌హైజర్ ఓర్ఫియస్/హెచ్‌ఈ 1”, హెడ్‌ఫోన్ ధర దాదాపు 12,000 పౌండ్లు అంటే దాదాపు 43 లక్షల రూపాయలు.

10 లక్షల హెడ్‌ఫోన్:

ప్రపంచంలో ఐదవ అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్ గురించి మాట్లాడుతూ, స్పిరిట్ టోరినో వాల్కిరియా టైటానియం ఈ జాబితాలోకి వచ్చింది. దీని ధర $12,800 అంటే దాదాపు రూ.10 లక్షలు

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..

Follow Us
బాధితులకు భరోసా.. హిట్‌ అండ్ రన్ కేసుల్లో పరిహారం పొందడం ఎలా?
బాధితులకు భరోసా.. హిట్‌ అండ్ రన్ కేసుల్లో పరిహారం పొందడం ఎలా?
ప్రతీ శనివారం బ్యాంక్‌లకు హాలీడే..? కేంద్రం క్లారిటీ ఇదే..
ప్రతీ శనివారం బ్యాంక్‌లకు హాలీడే..? కేంద్రం క్లారిటీ ఇదే..
నీ దారికి నువ్వే వెలుగవ్వాలి.. మీ జీవితాన్ని మార్చే బుద్ధుడి కథ!
నీ దారికి నువ్వే వెలుగవ్వాలి.. మీ జీవితాన్ని మార్చే బుద్ధుడి కథ!
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ