AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooler Smelling Problem: మీ ఇంట్లో కూలర్‌ చేపల కంపు కొడుతోందా..? ఇలా చేస్తే ఇళ్లంతా పరిమళమే..!

మీ కూలర్ నుంచి వస్తున్న చేపల వాసనతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నట్టయితే.. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే సమస్యను దూరం చేసుకోవచ్చు. ఎలాంటి దుర్వాసన లేకుండా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ.. హాయిగా నిద్రపోవచ్చు.

Cooler Smelling Problem: మీ ఇంట్లో కూలర్‌ చేపల కంపు కొడుతోందా..? ఇలా చేస్తే ఇళ్లంతా పరిమళమే..!
Cooler Smelling Problem
Jyothi Gadda
|

Updated on: Jun 13, 2023 | 4:16 PM

Share

వేసవి వేడి నుంచి తప్పించుకోవటానికి ప్రజలు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే, ఈ ఏసీల కంటే కూలర్లు తక్కువలోనే లభ్యమవుతుంటాయి. అంతేకాదు.. కూలర్లు.. ఎయిర్ కండీషనర్ లాగా పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు. తక్కువ ఖర్చుతో మీ గదిని చల్లగా ఉంచుతుంది. కానీ, ఇన్నీ ప్రయోజనాలు కలిగిన కూలర్లతో వినియోగదారులు కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది. వీటిలో తరచుగా నీళ్లు నింపటం, సరైన స్థలంలో ఉంచకపోతే తేమ, ఎక్కువ శబ్దంతో విసుగు పుట్టిస్తుంది. మరికొన్ని సార్లు కూలర్లలోని నీళ్లు చేపల వాసనతో కంపుకొడుతుంటాయి. అయితే,ఎయిర్ కూలర్ వాసనను ఎలా వదిలించుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అందుకోసం మార్కెట్‌లో లభించే కూలర్ స్మెల్ రిమూవర్ వంటి వాటి కోసం డబ్బు ఖర్చుపెడుతుంటారు. అయితే, అటువంటి పరిస్థితిలో ఎటువంటి శ్రమ, డబ్బు ఖర్చు లేకుండా కూలర్ మంచి వాసన కలిగించే మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం.. దాంతో మీరు ఈ సీజన్ అంతా సువాసనతో చల్లదనాన్ని ఆస్వాదించగలుగుతారు.

కూలర్ వాసనకు అతిపెద్ద కారణం దాని శుభ్రపరచడంలో నిర్లక్ష్యం. మీరు ప్రతి వారం కూలర్లో నీటిని పూర్తిగా తీసేసి శుభ్రం చేయకపోతే, అది కుళ్ళిన వాసన ప్రారంభమవుతుంది. బయట దుమ్ము, తేమ కారణంగా కూలర్‌ వాసన రావటం మొదలవుతుంది. దీంతో పాటు రెగ్యులర్ క్లీనింగ్ లేకపోవడం వల్ల కీటకాలు కూడా దానిలో పెరగడం ప్రారంభిస్తాయి. దాంతో కూలర్‌లో నీరు కుళ్ళిపోయేలా చేస్తుంది. ఇదీ కాకుండా, కూలర్‌లోని గడ్డి, కూలింగ్ ప్యాడ్‌లోని అచ్చు నుండి కూడా దుర్వాసన వస్తుంది.

వేప ఆకులు.. కూలర్‌లో దుర్వాసన, బ్యాక్టీరియా రెండింటినీ తొలగించడంలో వేప ఆకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇందుకోసం ఆకులను తీసుకుని కాటన్ గుడ్డలో కట్టాలి. ఈ వస్త్రం చాలా పలుచగా ఉండాలి. ఇలా తయారు చేసిన వేప ఆకుల మూటను కూలర్‌ నీటిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల నీరు వాసన పట్టదు. క్రిమికీటకాలు కూడా వృద్ధి చెందవు. కానీ, మీరు ప్రతి 3-4 రోజులకు ఒకసారి వేప ఆకులను మార్చాలి.

ఇవి కూడా చదవండి

నారింజ తొక్కలు.. నారింజ తొక్కతో మీ కూలర్‌ను సువాసన వచ్చేలా మార్చుకోవచ్చు. మీరు సాధారణంగా డస్ట్‌బిన్‌లో విసిరే నారింజ తొక్క నిజానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కూలర్‌ లోంచి వచ్చే దుర్వాసనను తొలగించడం కూడా నారింజ తొక్క చాలా బాగా పనిచేస్తుంది. దీని కోసం నారింజ తొక్కను ఎండబెట్టి పౌడర్‌ చేసుకోవాలి. దీనికి కాస్త దాల్చిన చెక్కను కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూలర్ నీటిలో కొద్ది మొత్తంలో చల్లుకోవాలి.

బేకింగ్ సోడాతో కూలర్ వాసన పరార్.. వంటలో ఉపయోగించే బేకింగ్ సోడా ఫ్రిజ్‌, కూలర్‌ వంటివి శుభ్రపరచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు కూలర్‌నుంచి వచ్చే దుర్వాసనను వదిలించుకోవడానికి కూడా వంట సోడాను ఉపయోగించవచ్చు. కూలర్ నుండి వచ్చే చేపల వాసన కూడా దూరమవుతుంది. మీ కూలర్ నుంచి వాసనతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నట్టయితే.. నీటిలో 1 టీస్పూన్ బేకింగ్ సోడాను చల్లుకోండి. ఇలా ప్రతి రోజూ కూలర్‌లో నీటిని నింపిన వెంటనే వంట సోడా కూడా చల్లుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..