IndiGo’s tail strike: ఇండిగో విమానానికి ప్రమాదం.. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో..

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే 27 పై ల్యాండ్ అవుతున్న సమయంలో ఆ విమానం వెనుక తోక భాగం రన్ వే పై కొద్ది దూరం నేలకు తగులుతూ రాసుకుపోయింది. దాంతో ప్రయాణికులు

IndiGo's tail strike: ఇండిగో విమానానికి ప్రమాదం.. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో..
Indigo
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 13, 2023 | 2:27 PM

IndiGo’s tail strike: ఇండిగో విమానానికి స్వల్ప ప్రమాదం జరిగింది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది. కోల్‌కతా నుండి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం ఆదివారం ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇండిగో విమానం రన్ వే 27 పై ల్యాండ్ అవుతున్న సమయంలో ఆ విమానం వెనుక తోక భాగం రన్ వే పై కొద్ది దూరం నేలకు తగులుతూ రాసుకుపోయింది. దాంతో ప్రయాణికులు కాసేపు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై డీజీసీఏ (DGCA) అంతర్గత విచారణకు ఆదేశించింది.

ఈ ప్రమాదంలో విమానం స్వల్పంగా ధ్వంసమైంది. దాంతో, విమానాన్ని ప్రయాణ సేవల నుంచి తాత్కాలికంగా తప్పించారు. విమానంలోని ఆపరేటింగ్ సిబ్బందిని దర్యాప్తు పూర్తయ్యేవరకు, తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కానీ, లేదా టేకాఫ్ అవుతున్న సమయంలో కానీ విమానం తోక భాగం రన్ వే కు బలంగా తగలడాన్ని టెయిల్ స్ట్రైక్ అంటారు. ఇటీవలి కాలంలో ఈ టెయిల్ స్ట్రైక్ ఘటనలు కూడా పెరిగాయి. ఇటీవల నాగపూర్ ఏర్ పోర్ట్ లో కూడా ఒక ఇండిగో విమానం టెయిల్ స్ట్రైక్ గురైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం