Parks: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ రోజున అన్ని పార్కుల్లో ప్రవేశం ఉచితం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలల్లో భాగంగా రాష్ట్ర అటవీశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని జూన్ 19న రాష్ట్రంలోని అన్ని జాతీయ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జూ పార్కుల్లో సందర్శకుల్ని ఉచితంగా అనుమతించనున్నట్లు తెలిపింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలల్లో భాగంగా రాష్ట్ర అటవీశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని జూన్ 19న రాష్ట్రంలోని అన్ని జాతీయ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జూ పార్కుల్లో సందర్శకుల్ని ఉచితంగా అనుమతించనున్నట్లు తెలిపింది. శనివారం జరిగిన అధికారిక సమావేశంలోఅటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎమ్ డోబ్రియాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు పర్యావరణంపై అవగాహణ పెంచేందుకు..ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని జిల్లాలోని అధికారులకు డోబ్రియాల్ ఆదేశాలు జారీ చేశారు.
గ్రామాల నుంచి రాష్ట్రస్థాయి వరకు చెట్ల పెంపకంపై ప్రాముఖ్యతను వివరించిన ఆయన.. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో మొక్కలు నాటాలని సూచించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రుతుపవనాల రాకతో హరితహారం తొమ్మిదవ దశను ప్రారభించాలని కోరారు. అలాగే హరితోత్సవం రోజున హరితహారం ద్వారా సాధించిన వాటిని వీడియోలు, పోస్టర్ల రూపంలో ప్రదర్శిస్తామని ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.