Pawan Kalyan: పవన్‌ వారాహి యాత్రకు పోలీసుల అనుమతి.. సెక్షన్‌ 30 యాక్ట్ అమలుపై సస్పెన్స్‌

జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రకు పోలీసుల నుంచి పర్మిషన్‌ లభించింది. తొలి విడతలో అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర జరగనుంది. బుధవారం (జూన్‌ 14) అన్నవరం దేవస్థానం నుంచి వారాహి యాత్ర మొదలై.. భీమవరం వరకు తొలి విడత సాగనుంది.

Pawan Kalyan: పవన్‌ వారాహి యాత్రకు పోలీసుల అనుమతి.. సెక్షన్‌ 30 యాక్ట్ అమలుపై  సస్పెన్స్‌
Pawan Kalyan Varahi Yatra
Follow us
Basha Shek

|

Updated on: Jun 13, 2023 | 12:50 PM

జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రకు పోలీసుల నుంచి పర్మిషన్‌ లభించింది. తొలి విడతలో అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర జరగనుంది. బుధవారం (జూన్‌ 14) అన్నవరం దేవస్థానం నుంచి వారాహి యాత్ర మొదలై.. భీమవరం వరకు తొలి విడత సాగనుంది. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో యాత్రకు జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఈ నెల 21న అమలాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో జనసేన నేతలు పోస్టర్లు కూడా ఆవిష్కరించారు. పోలీసుల పర్మిషన్‌ ఇచ్చినా అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో నెలాఖరు వరకు అమలాపురం, కొత్తపేట డివిజన్‌లో సెక్షన్ 30 యాక్ట్‌ అమలు చేయనున్నారు. ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు చేయకూడదంటూ పోలీసులు ఆదేశించారు. మరోవైపు పవన్ కల్యాణ్ వారాహి యాత్రను అడ్డుకోవడం కోసమే ఈ ఆంక్షలు అంటూ అమలాపురం జనసేన నేతలు మండిపడుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కోనసీమలో వారాహి యాత్ర, అమలాపురం భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామంటున్నారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రకు ప్రభుత్వం భయపడుతోందన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్. సెక్షన్‌ 30 ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. వారాహి యాత్రను ఆపడానికి ప్రయత్నిస్తే పెద్ద ఉద్యమం అవుతుందని హెచ్చరిస్తున్నారు జనసేన నేతలు. కోనసీమ జిల్లాలో సెక్షన్‌ 30 యాక్ట్ అమలుతో వారాహి యాత్రపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?