Andhra Pradesh: సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల భేటీ.. జీపీఎస్‌ అమలుపై కృతజ్ఞతలు..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. పలు విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు సీఎంను కలిశాయి. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అలాగే జీపీఎస్ అమలుకు నిర్ణయం తీసుకోవడంపై కృతజ్ఞతలు వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల నేతలు.

Andhra Pradesh: సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల భేటీ.. జీపీఎస్‌ అమలుపై కృతజ్ఞతలు..
Cm Jagan
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 13, 2023 | 1:32 PM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. పలు విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు సీఎంను కలిశాయి. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అలాగే జీపీఎస్ అమలుకు నిర్ణయం తీసుకోవడంపై కృతజ్ఞతలు వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు.

ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని సీఎం జగన్ పేర్కొన్నారు. ఉద్యోగులను సంతోషంగా ఉంచడానికి ప్రతి కార్యక్రమం మనసా, వాచా కర్మేణా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని తెలిపారు సీఎం. రాజకీయ కారణాలతో ఎవరైనా ఏదైనా చెప్పినా వాటిని విశ్వసించనక్కర్లేదని ఉద్యోగులకు సూచించారు జగన్. ఉద్యోగులు బాగుండాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామన్నారు. ఉద్యోగుల సమస్యలను వదిలేయకుండా.. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఉద్యోగులకు మంచి జరగాలి, రాష్ట్ర ప్రభుత్వానికీ మంచి జరగాలని ఆలోచన చేశామన్నారు.

జీపీఎస్‌ కోసం రెండు సంవత్సరాలు కసరత్తు చేశామన్నారు సీఎం. ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని డీఆర్‌లు జీపీఎస్‌లో ఇస్తున్నామన్నారు. జీపీఎస్‌ అన్నది దేశానికే రోల్‌ మోడల్‌ అవుతుందని పేర్కొన్నారు సీఎం జగన్. దీనివలన రిటైర్‌ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుందన్నారు. ఉద్యోగులకు సంబంధించి కేబినెట్‌ నిర్ణయాలన్నీ కూడా 60 రోజుల్లోగా అమల్లోకి రావాలని, ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్. అలాగే, డైలీ వేజెస్‌ కేటగిరీ ఉద్యోగులను కూడా ఆప్కాస్‌ పరిధిలోకి తీసుకురావాలని ఆధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే