Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Chengalamma: వైభవంగా చెంగాళమ్మ బ్రహ్మోత్సవాలు .. అమ్మవారిని పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం..

సూళ్ళూరు పేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కి ఏడు సంవత్సరాల కొకసారి మే - జూన్ నెలల మధ్య బ్రహ్మ్హోత్సవాలు జరుపుతారు. ఏడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు సుడిమాను ప్రతిష్ట, బలి హరణ తో ప్రారంభం అవుతాయి. రెండో రోజునుండి నాలుగో రోజు వరకు సుడి మానుకు చక్రం, నల్ల మేక, పూల మాల, పాలవెల్లి, మనిషి బొమ్మ కట్టి సుళ్ళు తిప్పుతారు

Sri Chengalamma: వైభవంగా చెంగాళమ్మ బ్రహ్మోత్సవాలు .. అమ్మవారిని పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం..
Sri Chengalamma Parameswari
Follow us
Surya Kala

|

Updated on: Jun 13, 2023 | 12:40 PM

నిత్యం భక్తులకు దర్శనం ఇస్తూ.. భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ తనకు భక్తులకు మధ్య తలుపులు అడ్డు ఒఉండరాదని భావించిన అమ్మవారు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగలమ్మ అమ్మవారు. శక్తి స్వరూపిని దర్శనం కోసం  తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు తమిళనాడు నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. ఏ ఆలయంలో అయినా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ కానీ సూళ్లూరుపేట చెంగాలమ్మ వారి ఆలయంలో ఏడు సంవత్సరాలకి ఒకసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇక్కడి అమ్మవారి ప్రత్యేకత.

స్థల పురాణం: 

కోల్‌కతా-చెన్నై హైవేలోని సూళ్లూరుపేట గ్రామంలో  శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి ప్రత్యక్షమైంది..ఈ ఆలయం నాలుగు మరియు ఐదవ శతాబ్దాలలో ఏర్పడిందని చరిత్ర మనకు తెలియజేస్తుంది. ప్రజలు ఆమెను “టెంకలి” గ్రామ దేవత అని కూడా పిలుస్తారు. కాలక్రమేణా, చెంగాళమ్మ వంటి భక్తులు తరచూ ఆమెను పూజిస్తారు. చెంగాళమ్మ జాతరను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు…. టంకాలి అని పిలువబడే గ్రామ దేవత సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయం తల్లిగా ఖ్యాతిని పొందింది…

ఇవి కూడా చదవండి

పురాణాల ప్రకారం, ఈత కొడుతున్న కొందరు పిల్లలు సమీపంలోని నదిలో చెంగాళమ్మ విగ్రహాన్ని కనుగొని ప్రస్తుత ప్రదేశానికి తీసుకువెళ్లారు. తిరునాళ్లు అనే పండుగలు క్రమానుగతంగా జరుగుతాయి. ఈ తరుణంలో చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది వ్యక్తులు పాల్గొంటున్నారు. ఈ ‘తిరునాళ్లు’ సమయంలో, ఒక మేకను ఒకరోజు స్తంభానికి ఒక చివరన ఉంచి, ఆలయం ముందు గాలిలో ప్రదక్షిణ చేస్తారు. అందుకే సూళ్లూరుపేట అనే పేరు వచ్చింది, ఈ పద్ధతిని “సుల్లు” అంటారు. సుల్లుతో పాటు, ఆలయానికి సమీపంలో మద్యాహ్నం కాళంగి నదిలో శ్రీ చెంగాళమ్మ విగ్రహాన్ని “తెప్ప” అనే ఓడపై ప్రదర్శించే ‘తెప్పోత్సవం’ కూడా ఉంది. తిరునాళ్లూలో మహిషాసుర మర్దిని, బాణసంచా కాలుస్తారు…

ఆలయంలో జరిగే పూజలు 

సూళ్లూరుపేట చెంగలమ్మా ఆలయంలో నిత్యం ఎన్ని రకాల పూజలు జరిగుతుంటాయి..ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవ కలశ అభిషేకం, మహా చండీ యాగం ఆర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్ధం నిర్వహిస్తున్నారు.

కార్యక్రమాలు 

వివాహము, ఉపనయనం,పిల్లలకు తొలిసారి చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం లాంటివి జరుపుకోడానికి దేవాలయంలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. విశాల మండపము, వసతి గదులు అందుబాటులో ధరలతో దేవస్థానం ఏర్పాటు చేసింది. గణపతి నవ రాత్రులు, ఉగాది, మహాశివరాత్రి, నాగుల చవితి సందర్భాలలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు.దసరా నవ రాత్రులలో ఆలయ శోభ మరింతగా పెరుగుతుంది.మన రాష్ట్రం నుండే కాక తమిళ నాడు నుండి కూడా భక్తులు తరలి వస్తారు.

ఏడేళ్లకు ఒకసారి బ్రహ్మోత్సవాలు 

సూళ్ళూరు పేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కి ఏడు సంవత్సరాల కొకసారి మే – జూన్ నెలల మధ్య బ్రహ్మ్హోత్సవాలు జరుపుతారు. ఏడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు సుడిమాను ప్రతిష్ట, బలి హరణ తో ప్రారంభం అవుతాయి. రెండో రోజునుండి నాలుగో రోజు వరకు సుడి మానుకు చక్రం, నల్ల మేక, పూల మాల, పాలవెల్లి, మనిషి బొమ్మ కట్టి సుళ్ళు తిప్పుతారు. మూడో రోజున మహిషాసుర మర్దన అంటే దున్నపోతు బొమ్మ తలను నరకడం జరుగుతుంది. లోక కంటకుడైన మహిషాసురుని మహాకాళి సంహరించి లోకాలను కాపాడినందుకు ఆనందించిన ప్రజలు అయిదో రోజున కాళింది నదిలో అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆఖరి రోజున పరమేశ్వరిని పుష్ప పల్లకిలో ఊరేగిస్తారు. ఈ ఏడు రోజులు అమ్మవారిని గ్రామంలో అశ్వ, సింహ, నంది ఇలా రోజుకో వాహనం మీద ఊరేగిస్తారు. ప్రస్తుతం ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగు తున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..