- Telugu News Spiritual Plan to visit jagannath rath yatra in puri traveling or planning tips in telugu
Jagannath Rath Yatra: పూరీ రథయాత్ర హిందువులకు వెరీ వెరీ స్పెషల్.. వెళ్లాలనుకునే ప్లాన్ చేస్తున్నారా.. మీ కోసమే ఈ టిప్స్
ప్రతి సంవత్సరం పూరీలో జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం 20 జూన్ 2023 నుంచి పురీ రథయాత్ర నిర్వహించనున్నారు. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. మీరు కూడా రథయాత్రకు వెళ్లాలని భావిస్తున్నట్లు అయితే ప్రయాణానికి సంబంధించిన ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
Updated on: Jun 13, 2023 | 11:34 AM

ఈ నెల 20వ తేదీ నుంచి పూరీలో జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానుంది. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో భాగమవుతారు. యాత్రలో శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర లతో కలిసి రథంపై పురీ వీధుల్లో విహరిస్తాడు. చార్ ధామ్‌లో ఒకటైన జగన్నాథ ధామ్ రథయాత్రలో పాల్గొనాలని మీరు కూడా ఆలోచిస్తున్నట్లయితే ప్రయాణానికి సంబంధించిన ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

హోటల్ బుకింగ్: జగన్నాథ రథయాత్ర సమయంలో ఆలయం చుట్టూ ఉండే ప్రదేశాలు భక్తులతో నిండిపోతాయి. కనుక ఇక్కడ గంటల తరబడి గడపాల్సి వస్తే.. అప్పుడు అది ఇబ్బందిగా మారుతుంది. కనుక పురీ రథ యాత్రకు బయలుదేరే ముందు, హోటల్, ధర్మశాల లేదా ఆశ్రమంలో ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోండి.

ప్యాకింగ్ చిట్కాలు: యాత్రకు తీసుకుని వెళ్లే బ్యాగ్‌ని ప్యాక్ చేసుకునే సమయంలో కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ముఖ్యంగా పురీ రథయాత్రకు వెళ్ళడానికి ఎక్కువగా వృద్ధులు ఆసక్తిని చూపిస్తారు. కనుక మీతో పాటు వృద్ధులను కూడా తీసుకుని వెళ్తున్నట్లు అయితే.. వారి బట్టలు నుంచి మందుల వరకు కావాల్సిన అన్నింటిని ప్యాక్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి.

ఆహారంలో పొరపాటు వద్దు: పూరీలో జగన్నాథ యాత్రలో ఉత్తమ శోభ కనిపిస్తుంది. మార్కెట్లలో చాలా క్యాటరింగ్ షాపులు ఉన్నాయి. ఇక్కడ రుచికరమైన వంటకాలు తక్కువ ధరలలో లభిస్తాయి. కానీ అవి మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. కనుక డ్రై ఫ్రూట్స్ లేదా స్నాక్స్ తీసుకుని వెళ్లండి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫుడ్ ఆదుకుంటుంది.

రవాణా: మీరు ఏదైనా రవాణాప్రయాణాల సాధనాల ద్వారా పూరికి చేరుకోవచ్చు ..అదే సమయంలో పూరి నుంచి తిరిగి స్వగ్రామం రావడానికి ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకోండి. చాలా మంది పూరీకి చేరుకున్న తర్వాత రిటర్న్ టిక్కెట్‌లను బుక్ చేస్తారు. అయితే అప్పుడు సీజన్ కారణంగా.. చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.





























