Ketu Transit 2023: త్వరలో కేతు సంచారం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..
కేతువు స్థాన చలనంతో అన్ని రాశులకు చెందిన వ్యక్తులపై మంచి చెడుల ప్రభావాన్ని చూపించనుంది. కేతు సంచారం అక్టోబర్ నెలలో జరగనుంది.. కనుక అక్టోబర్ 30 నుంచి దాదాపు అన్ని రాశులకు చెందిన వ్యక్తులకు మంచి జరగనున్నదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పారు.
ప్రతి సంవత్సరం గ్రహాలు తమ రాశులను మార్చుకుంటూ సంచరిస్తూనే ఉంటాయి. ఈ గ్రహ సంచారంతో అన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇప్పటికే శనీశ్వరుడు, బృహస్పతి వంటి గ్రహాలు తమ రాశి సంచారాన్ని మార్చుకోగా ఎన్నో నెలల తర్వాత కేతువు గ్రహసంచారం చేయనున్నాడు. కేతువు తన రాశిని వదిలి మరో రాశిలోకి ఈ ఏడాది అక్టోబర్ లో అడుగు పెట్టనున్నాడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహ సంచారంతో పలు రాశులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. కేతువు స్థాన చలనంతో అన్ని రాశులకు చెందిన వ్యక్తులపై మంచి చెడుల ప్రభావాన్ని చూపించనుంది. కేతు సంచారం అక్టోబర్ నెలలో జరగనుంది.. కనుక అక్టోబర్ 30 నుంచి దాదాపు అన్ని రాశులకు చెందిన వ్యక్తులకు మంచి జరగనున్నదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పారు. ఈ నేపథ్యంలో కేతు సంచారంతో ఏఏ రాశులపై ఏ విధమైన ప్రభావం చూపించనున్నది.. కేతు చేడు ప్రభావం నుంచి బయటపడడానికి ఏమి చెయ్యాలో తెలుసుకుందాం..
ఏ రాశులవారిపై కేతు శుభ ప్రభావం చూపించనున్నదంటే..
అక్టోబర్ నెలాఖరున జరగనున్న కేతు సంచారంతో సింహం, వృషభం, ధనుస్సు రాశులకు అద్భుతమైన ప్రయోజనాలుంటాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఆర్ధిక, సామజిక లాభాలను పొందుతారు. అంతేకాదు ఈ కేతు సంచార సమయంలో ఏ పనులు చేపట్టినా ఈజీగా సక్సెస్ అందుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల వ్యాధుల నుంచి బయటపడే ఛాన్స్.. ఇక ఆకస్మిక ధన లాభం పొందుతారు. సుదీర్ఘంగా నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే అవకాశం ఉంది. అంతేకాదు ప్రేమికులకు కేతు సంచారం వలన శుభఫలితాలను పొందే అవకాశం ఉంది.
వృషభం, ధనుస్సు రాశులవారు వ్యాపారాల్లో పెట్టుబడులకు అనుకూల సమయం. ఊహించని లాభాలను పొందుతారు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే ఈ రాశులకు చెందిన వ్యక్తులకు ప్రయోజకరం.
కేతు సంచారం అశుభ ఫలితాలను ఇస్తుందంటే..
కేతు సంచారం వలన మేష, మిథున, మకర రాశుల వారికీ అశుభ ఫలితాలను ఇస్తుంది. కొన్ని రకాల కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఈ మూడు రాశుల వారు అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్కులు చెబుతున్నారు.
కేతు సంచారంతో ఏర్పడే చెడు ప్రభావానికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు:
కేతు సంచారం వలన ఏర్పడే చెడు ప్రభావ నివారణ కోసం భైరవుడిని పూజించాలి. పూజ అనంతరం భైరవ చాలీసాను జపించాల్సి ఉంటుంది.
కుక్కకు ఆహారపదార్ధాలను అందించడం వలన కేతు సంచారంతో ఏర్పడే చెడు ప్రభావం తొలగిపోతుంది.
ఓం శ్రీ శ్రీ శ్రీ కేత్వే నమః అనే మంత్రాన్ని పాటించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).