Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చండి.. 70 వేల మంది యువతకి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ప్రధాని మోదీ..

Rozgar Mela: కొత్తగా నియమితులైన దాదాపు 70,000 మందికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలు ఎన్‌డిఎ, బిజెపి ప్రభుత్వానికి కొత్త గుర్తింపుగా మారాయని అన్నారు. బీజేపీ పాలిత ప్రభుత్వాలు కూడా ఇలాంటి జాబ్ మేళాలను..

PM Modi: రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చండి.. 70 వేల మంది యువతకి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ప్రధాని మోదీ..
PM Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 13, 2023 | 12:31 PM

Employment Fair: ప్రధాని నరేంద్ర మోదీ 70 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ఫెయిర్ కింద వీరిని ఎంపిక చేశారు. ఇవాళ మంగళవారం (జూన్ 13) ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన దాదాపు 70,000 మందికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలు ఎన్‌డిఎ, బిజెపి ప్రభుత్వానికి కొత్త గుర్తింపుగా మారాయని అన్నారు. బీజేపీ పాలిత ప్రభుత్వాలు కూడా ఇలాంటి జాబ్ మేళాలను నిరంతరం నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రధాని అన్నారు. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలలో వచ్చే వారికి ఇది చాలా ముఖ్యమైన సమయం. రాబోయే 25 ఏళ్లలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు.

ముద్రా యోజన కోట్లాది మంది యువతకు సహాయం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా వంటి ప్రచారాలు యువత సామర్థ్యాన్ని మరింతగా పెంచాయి. ప్రభుత్వం నుంచి సహాయం పొందిన ఈ యువకులు ఇప్పుడు చాలా మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నారని ప్రశంసించారు ప్రధాని మోదీ.

అవినీతి ఒక గుర్తింపుగా మారింది

రాజకీయ అవినీతికి గత ప్రభుత్వాలు కేరాఫ్ అడ్రస్‌గా మారాయని కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ విమర్శించారు ప్రధాని మోదీ. వచ్చే 25 ఏళ్లలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. ప్రపంచం మొత్తం భారత్‌ను విశ్వసిస్తోంది. అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళుతోంది.

విపక్షాలపై ప్రధాని మోదీ టార్గెట్‌

దేశంలో జరుగుతున్న ఈ ఉపాధి ప్రచారం కూడా పారదర్శకత, సుపరిపాలనకు నిదర్శనమని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి ప్రధాని అన్నారు. మన దేశంలో కుటుంబ ఆధారిత రాజకీయ పార్టీలు ప్రతి వ్యవస్థలోనూ ఆశ్రిత పక్షపాతాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నాయో మనం చూశాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా బంధుప్రీతి, అవినీతికి పాల్పడేవారు. ఈ పార్టీలు కోట్లాది మంది దేశ ప్రజలకు ద్రోహం చేశాయి. మా ప్రభుత్వం కూడా పారదర్శకతను తీసుకువచ్చింది. మేము ఆశ్రిత పక్షపాతాన్ని అంతం చేసాం.

ప్రధాని మోదీ ప్రసంగం ఇక్కడ వినండి..

కొత్తగా నియమితులైన వ్యక్తులు రాబోయే 25 ఏళ్లలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళతారని ప్రధాని అన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పించింది మోదీ ప్రభుత్వం. గత 5 ఉపాధి మేళాల్లో ఇప్పటి వరకు 4.29 లక్షల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. జూన్ 13వ తేదీ మంగళవారం దేశంలోని 43 చోట్ల ఉపాధి మేళాలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం