Karnataka: తల్లిని చంపి.. శవాన్ని సూట్‌కేసులో కుక్కిన కూతురు.. కారణం తెలిస్తే హడలిపోతారు..!
కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు కనిపెంచి, పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేసిన తల్లిని అత్యంత క్రూరంగా చంపేసింది. పైగా ఆ శవాన్ని ఓ సూట్‌కేసులో కుక్కి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చింది. ఈ ఘటన బెంగళూరులో సంచలనం రేపుతోంది. ఇంతకీ తల్లిని ఎందుకు చంపావని ఆరా తీస్తే..
కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు కనిపెంచి, పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేసిన తల్లిని అత్యంత క్రూరంగా చంపేసింది. పైగా ఆ శవాన్ని ఓ సూట్‌కేసులో కుక్కి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చింది. ఈ ఘటన బెంగళూరులో సంచలనం రేపుతోంది. ఇంతకీ తల్లిని ఎందుకు చంపావని ఆరా తీస్తే.. ఆమె చెప్పిన కారణం విని పోలీసులు షాక్ అయ్యారు. తల్లిని చంపిన కేసులో కూతురుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కొల్‌కతాకు చెందిన సొనాలీ సేన్ కుటుంబం బెంగళూరులోని మైకోలేఅవుట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటోంది. సోనాలి సేన్, సోనాలి సేన్ భర్త, కొడుకు, అత్తమ్మ, సోనాలి సేన్ తల్లి అందరూ కలిసి ఒకే ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. అయితే, సోమవారం నాడు ఉదయం 7 గంటల సమయంలో సోనాలీ సేన్ తన తల్లికి నిద్రమాత్రలు ఇచ్చింది. ఆ తరువాత 11 గంటల సమయంలో నిద్ర మత్తులోనే కడుపు నొప్పితో విలవిలలాడింది ఆ తల్లి. ఆ సమయంలో సోనాలీ సేన్ తన తల్లి ముఖాన్ని దిండుతో అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి మధ్యాహ్నం 1 గంటకు ఉబర్ క్యాబ్‌లో పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. తన తల్లిని తాను చంపినట్లు పోలీసులకు వివరించింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నా పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. విచారణలో ఆమె చెప్పిన వివరాలు విని పోలీసులే షాక్ అయ్యారు.
సోనాలి భర్త టెక్కీ, ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఘటన జరిగినప్పుడు అతను ఆఫీస్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య విషయాన్ని పోలీసులు అతనికి తెలుపగా.. షాక్ అయ్యాడు. తన తల్లే తనను చంపేయమని కోరిందట.. ‘అమ్మ తన భర్త వద్దకు వెళ్తానన్నది. అక్కడ ఆయనతో ప్రశాంతంగా ఉంటానని చెప్పింది. తనను చంపమని ఆమె కోరింది. అందుకే మొదట నిద్రమాత్రలు ఇచ్చాను. ఆ తరువాత మూర్ఛ రావడంతో మెత్తతో ఊపిరి ఆడకుండా చేసి అమ్మను చంపేశా’ అని చెప్పుకొచ్చింది. ఇది విని పోలీసులు నిర్ఘాంతపోయారు.
అయితే, ఈ హత్యకు మరో కారణం కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. సోనాలీ అమ్మ.. తన అత్తతో నిత్యం ఘర్షణకు దిగేదట. దాంతో విసిగిపోయిన సోనాలీ.. ఇలా తన తల్లిని దారుణంగా హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..