Anurag Thakur: దేశాన్ని అస్థిరపరచే కుట్ర.. జాక్ డోర్సీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్..

Anurag Thakur on Jack Dorsey: జాక్ డోర్సే చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి.. పచ్చి అబద్దం అంటూ కేంద్ర ప్రభుత్వం ఖండించింది. జాక్ డోర్సే అంతా అబద్దాలు చెబుతున్నారంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Anurag Thakur: దేశాన్ని అస్థిరపరచే కుట్ర.. జాక్ డోర్సీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్..
Anurag Thakur on Jack Dorsey
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 13, 2023 | 5:33 PM

Anurag Thakur on Jack Dorsey: కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం సైతం మూడు చట్టాలను రద్దు చేసింది. అయితే, రైతుల ఆందోళనల సమయంలో భారత ప్రభుత్వం నుంచి తమకు తీవ్ర ఒత్తిడి ఎదురైందంటూ ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఇటీవల పాల్గొన్న జాక్ డోర్సే.. సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు, విమర్శలు చేసే జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం నుంచి తమకు చాలా ఒత్తిళ్లు, అభ్యర్థనలు వచ్చాయని, భారత్‌లో ట్విట్టర్‌ను మూసేస్తామంటూ కొందరు బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. ట్విట్టర్ ఉద్యోగుల ఇళ్లలో తనిఖీలు చేస్తామన్న హెచ్చరికలు కూడా వచ్చాయంటూ ఆరోపించారు. అయితే, ఈ బెదిరింపులు ఎవరి నుంచి వచ్చాయన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే, జాక్ డోర్సే చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి.. పచ్చి అబద్దం అంటూ కేంద్ర ప్రభుత్వం ఖండించింది. జాక్ డోర్సే అంతా అబద్దాలు చెబుతున్నారంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.

“భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత పారదర్శక ప్రజాస్వామ్యం. భారతదేశంలో ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు కొన్ని విదేశీ శక్తులు, వారి ఏజెంట్లు దేశాన్ని అస్థిరపరచడానికి, పరువు తీయడానికి ప్రణాళికాబద్ధంగా చురుకుగా ఉంటారు. జాక్ డోర్సే అంతా అబద్ధం చెబుతున్నారు.. ట్విట్టర్ టేకోవర్‌పై.. ట్విట్టర్ ఫైల్‌లకు సంబంధించి పక్షపాతం, బెదిరింపులు, ఒత్తిళ్ల గురించి వెల్లడైనప్పటికీ.. ఇంత వరకు ఆయన ఎందుకు స్పందించలేదు.. మాట్లాడలేదు’’ అంటూ అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

జాక్ వ్యాఖ్యలపై కేంద్ర సాంకేతిక, సమాచారశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన పచ్చి అబద్ధాలు ఆడుతున్నారంటూ కొట్టిపడేశారు. డోర్సే అబద్ధాలు చెబుతున్నారని, ఆయన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదు.. డోర్సే హయాంలో 2020-22 మధ్య భారత్‌లో ట్విట్టర్ పదపదే నిబంధనలు ఉల్లంఘించిందంటూ పేర్కొన్నారు. డోర్సే హయాంలో భారత సార్వభౌమత్వాన్ని అంగీకరించేందుకు ట్విట్టర్ ఇష్టపడలేదన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..