My India My Life Goals: ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత.. వెర్సోవా బీచ్ క్లీనింగ్‌పై అఫ్రోజ్ షా ఏమన్నారంటే..
Afroz Shah - My India My Life Goals: సముద్ర తీర ప్రాంతంలో ప్లాస్టిక్ నిర్మూలనకు అఫ్రోజ్ షా చేస్తున్న సేవలకు భారత ప్రభుత్వంతోపాటు.. ఐక్యరాజ్యసమితి సైతం అభినందించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AG స్పష్టంగా చెబుతోందంటూ..
Afroz Shah – My India My Life Goals: పర్యావరణ పరిరక్షణ మనందరి భాధ్యత.. పర్యావరణం బాగుంటేనే మనం సంతోషంగా ఉంటాం.. పర్యవరణ పరిరక్షణ కోసం ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. జూన్ 5, 1973 నుంచి ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అయితే, ఈ ఏడాది 50వ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50వ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘మై ఇండియా – మై లైఫ్ గోల్స్’ పేరుతో లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ మూవ్‌మెంట్ – లైఫ్ అనే నినాదంతో కేంద్రం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పర్యావరణ హితం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఈ ఉద్యమంలో టీవీ9 సైతం భాగస్వామ్యమై.. పర్యవరణ పరిరక్షణ కోసం పాటుపడుతోంది. ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యం దేశంలోని ప్రజలలో అవగాహన కల్పించడం.. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అయ్యేలా ప్రేరేపించడం.. దీనిలో భాగంగా టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న పలువురు పర్యావరణ కార్యకర్తల జీవితాలను, వారి సేవలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం.. ముంబైకి చెందిన పర్యావరణ కార్యకర్త అఫ్రోజ్ షా.. ఎవ్వరూ చేయలేని పనిచేసి.. ఆదర్శవంతంగా మారారు.. సముద్ర తీర ప్రాంతంలో ప్లాస్టిక్ నిర్మూలనకు అఫ్రోజ్ షా చేస్తున్న సేవలకు భారత ప్రభుత్వంతోపాటు.. ఐక్యరాజ్యసమితి సైతం అభినందించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AG స్పష్టంగా చెబుతోంది..ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత.. అంటూ ఆయన అందరి బాధ్యతను గుర్తుచేస్తున్నారు. ముంబైలోని వెర్సోవా బీచ్‌ను శుభ్రంగా మార్చి.. ప్రపంచవ్యాప్తంగా పేరు గడించారు షా..
అఫ్రోజ్ షా ముంబైకి చెందిన పర్యావరణ కార్యకర్త వృత్తిరీత్యా న్యాయవాది. ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీన్-అప్ ప్రాజెక్ట్‌ను నిర్వహించారు. ఇది ఒక ఉద్యమంగా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రం చేయడానికి ప్రేరేపించింది. 2016లో ముంబైలోని వెర్సోవా బీచ్‌ను శుభ్రపరిచేందుకు నాయకత్వం వహించినందుకు షాను ఐక్యరాజ్యసమితి ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్‌గా పేర్కొంది. బీచ్‌లో పేరుకున్న 5 మిలియన్ కేజీల చెత్తను తొలగించడానికి షాకు 8 ఏళ్ళు పట్టింది. ముంబైలోని బీచ్‌లను క్లీన్ చేయడానికి అఫ్రోజ్ షా చేసిన ప్రయత్నాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా క్లీన్ సీస్ ప్రచారాన్ని ప్రారంభించింది. అఫ్రోజ్ షా CNN హీరోస్ ఆఫ్ ది ఇయర్ అవార్డు-2019 గెలుచుకున్నారు. షా కృషిని ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో మే 28, 2017లో ప్రస్తావించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..