Snakes: పాములు బాబోయ్ పాములు.. ఆ ప్రాంతంలో వెయ్యికి పైగా కేసులు.. భయాందోళనలో ప్రజలు

పామును చూస్తేనే కొందరు భయంతో పరిగెడతారు. ప్రమాదవశాత్తు పాము కాటేసినప్పుడు సమయానికి వైద్యం అందక చాలామంది మృతి చెందిన ఘటనలు ఎన్నో జరిగాయి. అయితే మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో పాముల బెడత కలకలం రేపుతోంది.

Snakes: పాములు బాబోయ్ పాములు.. ఆ ప్రాంతంలో వెయ్యికి పైగా కేసులు.. భయాందోళనలో ప్రజలు
Snake
Follow us
Aravind B

|

Updated on: Jun 13, 2023 | 3:56 PM

పామును చూస్తేనే కొందరు భయంతో పరిగెడతారు. ప్రమాదవశాత్తు పాము కాటేసినప్పుడు సమయానికి వైద్యం అందక చాలామంది మృతి చెందిన ఘటనలు ఎన్నో జరిగాయి. అయితే మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో పాముల బెడత కలకలం రేపుతోంది. 17 నెలల్లోనే అక్కడ వెయ్యికి పైగా పాము కాటు కేసులు నమోదయ్యాయి. పాము కాటుకు గురైన వారిలో సుమారు 14 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కువగా అలిబాగ్, పాన్వెల్, ఖలాల్‌పూర్, మహద్ లాంటి ప్రాంతల్లో ఈ ప్రమాదాలు ఎక్కవగా జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు.

ఎవరైన పాము కాటుకు గురైనప్పుడు.. వారిని మంత్రాలు చేసేవారు, నాటు వైద్యం చేసేవారి దగ్గరికి వెళ్లకుండా వెంటనే సమీపంలో ఉండే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. రాయ్‌గఢ్ జిల్లాలోని 14 ప్రాంతాల్లో పాము కాటుకు వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా.. పాము లేదా తేలు కాటుతో ఎవరైనా రైతులు మరణిస్తే వారి కుటుంబీకులకు మాత్రమే పరిహారం ఇస్తున్నారని.. ఇతరులు కూడా ఎవరైనా వీటివల్ల చనిపోతే వారి కుటుంబ సభ్యులకు కూడా పరిహారం అందించాలంటూ గతంలో బాంబే హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు