Steel Plant :ఒడిషాలో మరో ప్రమాదం.. స్టీల్ పరిశ్రమలో గ్యాస్ లీక్.. 19 మందికి గాయాలు

ఈ ఘటనలో మొత్తం 19 మందికి గాయపడినట్టుగా వెల్లడించారు. జిల్లా అధికర యంత్రాంగం సైతం ఘటనా స్థలానికి చేరుకుంది. ముమ్ముర సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై లోతైన దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటకు స్టీమ్ పైప్ వద్ద ఇన్ స్పెక్షన్ జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు.

Steel Plant :ఒడిషాలో మరో ప్రమాదం.. స్టీల్ పరిశ్రమలో గ్యాస్ లీక్.. 19 మందికి గాయాలు
Odisha Tata Steel Plant
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 13, 2023 | 7:58 PM

ఒడిషాలో మరో ప్రమాదం జరిగింది. ఒడిషాలోని స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదకర గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో దాదాపు 19 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. ఒడిషా లోని దెంకనల్ జిల్లా మెరమండలి వద్ద ఉన్న టాటా స్టీల్ కర్మాగారంలో మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిశ్రమలో గ్యాస్ లీక్ అవడంతో స్టీమ్ పైప్ పేలిపోయింది. పైప్ పేలిపోయిన తరువాతే కార్మికులకు, ఇంజనీర్లకు తీవ్ర గాయాలైనట్టుగా సమాచారం. స్టీమ్ పైప్ పేలిపోవడంతో అందులో ఉన్న వేడి నీరు అక్కడే ఉన్న కార్మికులు, ఇంజనీర్ల మీద పడింది. ఈ కారణంగానే ప్రమాదం తీవ్రత మరింత పెరిగిందని.. తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఒడిషా దెంకనాల్ జిల్లా ఎస్పీ జ్ఞానరంజన్ మహాపాత్రో ఘటనపై స్పందించారు.. ఈ ఘటనలో మొత్తం 19 మందికి గాయపడినట్టుగా వెల్లడించారు. జిల్లా అధికర యంత్రాంగం సైతం ఘటనా స్థలానికి చేరుకుంది. ముమ్ముర సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై లోతైన దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటకు స్టీమ్ పైప్ వద్ద ఇన్ స్పెక్షన్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.

ప్రమాద సమయంలో పైప్ ఇన్ స్పెక్షన్ వద్ద ఉన్న సిబ్బందిపైనే ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువగా కనిపించింది. తీవ్రంగా గాయపడిన వారిని తొలుత పరిశ్రమ ఆవరణలోని ఆస్పత్రిలోనే ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కటక్‌కి పంపించినట్టు కంపెనీ తమ తాజా ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..