IT Raids: ఎమ్మెల్యేల ఆస్తులపై రెండో రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు.. కంపెనీల లింకులపై స్పెషల్ ఫోకస్..

Telangana: తెలంగాణలో మరోసారి ఐటీ రెయిడ్స్‌ హీట్‌ పుట్టించేస్తున్నాయి. ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కంపెనీల్లో దాడులు చేయడం కలకలం రేపుతోంది. అది కూడా 60 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది.  అయితే తాజాగా రెండో రోజు కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి.

IT Raids: ఎమ్మెల్యేల ఆస్తులపై రెండో రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు.. కంపెనీల లింకులపై స్పెషల్ ఫోకస్..
It Raids
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 15, 2023 | 7:33 AM

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణలో ఐటీ రెయిడ్స్‌ రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, నివాసంలో రెండో రోజు కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి 10 గంటల వరకు పైళ్ల కుటుంబ సభ్యుల వద్ద పలు కంపెనీలు లావాదేవీల వివరాలను సేకరించారు అధికారులు. మోహన్ రెడ్డి నివాసంలో లభించిన కీలక డాక్యుమెంట్ లపై పైళ్ల వద్ద వివరాలు సేకరిస్తున్నారు ఐటీ అధికారులు. బుధవారం ఒకేరోజు ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలను ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ టార్గెట్‌ చేయడం రాజకీయ రచ్చకు కారణంగా మారింది.  ఇళ్లు, కంపెనీల్లో బుదవారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు చేశారు ఐటీశాఖ అధికారులు. ఈ ముగ్గురు నేతలకు చెందిన మొత్తం 60 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేయడంతో ఆందోళనకు కారణంగా మారింది. ఈ ముగ్గురు నేతలు పన్నులు ఎగ్గొట్టారన్నది ఐటీ అధికారుల ప్రధాన అభియోగం.

ఈ ముగ్గురి మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీలే ఐటీ దాడులకు కారణంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌‌లోని మెయిన్‌ల్యాండ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌లో పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. సరిగ్గా అదే కంపెనీలో మరో డైరెక్టర్‌గా కొత్త ప్రభాకర్‌రెడ్డి భార్య మంజులత కూడా ఉండటంతో ఒకరి తర్వాత మరొకరిపై ఈ దాడులు చేస్తున్నారు ఐటీ అధికారులు. మెయిన్‌ల్యాండ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ పెద్దఎత్తున పన్నులు కట్టలేదన్నదే ఇక్కడ ప్రధాన ఆరోపణ.

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కంటే ముందు ఆయన మామ మోహన్‌రెడ్డి ఇంట్లో దాడులు చేశారు. భువనగిరి తహశీల్దార్‌గా ఏడేళ్లు పనిచేశారు మోహన్‌రెడ్డి. ఈ  రిటైర్ అయ్యారు. మోహన్‌రెడ్డి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్‌ ఆధారంగానే MLA పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించింది. MLA పైళ్ల శేఖర్‌రెడ్డితో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి వ్యాపార లింకులు ఉన్నట్టు తేలడంతో ఆయన ఇళ్లు, ఆఫీసుల్లోనూ తనిఖీలు చేపట్టారు అధికారులు.

మరోవైపు జేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేట్‌లోని కార్పోరేట్ ఆఫీసులో కూడా ఐటీ అధికారులు ఆడిట్ చేస్తున్నారు. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న మర్రి. రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతంలో ఓ పైపుల తయారీ పరిశ్రమ కూడా ఆయనకు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఐటీ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం