Watch: నీ తెలివికి సాలామ్‌ రా అయ్యా..! ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకే బండ్లో బయల్దేరింది..

పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఇంటిల్లిపాది అంత దూరం ప్రయాణించాలంటే చాలా ఖర్చవుతుంది. అందుకే ఇలా వెళ్తున్నారేమో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా రిస్క్ తీసుకుని ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దంటూ ఇంకొందరు చెబుతున్నారు.

Watch: నీ తెలివికి సాలామ్‌ రా అయ్యా..! ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకే బండ్లో బయల్దేరింది..
7 Seater Car
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 15, 2023 | 8:23 AM

మన దేశంలో మేధావులకు కొదువే లేదు.. అందుకే మన దేశాన్ని కొత్త ఆవిష్కరణలకు మాతృభూమిగా పరిగణిస్తారు. మారుమూల పల్లె నుంచి పట్నం దాకా జుగాడు చేసే అద్భుతాలు అందరినీ ఆకట్టుకుంటుంటాయి. వారు చేసే చిత్ర విచిత్ర పనులకు సంబంధించి సోషల్ మీడియాలో తరచూ వైరల్‌ అవుతుంటారు..విదేశీయుల ఊహకు కూడా అందనివి మన గ్రామాల్లో జరుగుతున్నాయి. వాహనాల విషయంలో అనేక రకాల జూగాడ్‌ కనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో తెగ సందడి చేస్తోంది. ఇందులో ఒక వ్యక్తి తన బైక్‌ను ఫోర్ వీలర్‌గా మార్చాడు. యూపీలోని బారాబంకి జిల్లాలో అలాంటిదే కనిపించింది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం బైక్‌పై ఇద్దరు మాత్రమే కూర్చోవాలి. అయితే ఈ జుగాడు కుర్రాడి బైక్ పై ఒకరో ఇద్దరో కాదు తొమ్మిది మంది కూర్చున్నారు.

ఈ వీడియోలో ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఎక్కడికో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. తనతో పాటు ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులను తీసుకుని బైక్‌ పై ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బైక్‌మీద తనతో పాటు ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత బైక్కు వెనుకాల తాడు సాయంతో రిక్షా లాంటి ఏర్పాటు చేశాడు. అందులో ముగ్గురు మహిళలు ముగ్గురు చిన్నారులను కూర్చోబెట్టుకున్నాడు. ఇలా మొత్తం తొమ్మిది మంది ఎక్కారు. ఇది బైక్ కాదు చిన్నపాటి రిక్షాని తలపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వింత వాహనం వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ జుగాడు బైక్‌ లక్నో-అయోధ్య హైవేపై బారాబంకి పట్టణం గుండా వెళుతూ కనిపించింది. మామూలుగా తొమ్మిది మందిని కారులోనే అతి కష్టం మీద ఎక్కించవచ్చు. అలాంటిది ఈ జుగాడ్ ఏకంగా బైక్‌నే కారులా మార్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ, ఇలాంటి వారు ఎదురయ్యే ప్రమాదాల గురించి ఆలోచించరు. తెలిసి తమ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఇలాంటి ప్రయాణాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, అవి ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం అంటూ పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఇంటిల్లిపాది అంత దూరం ప్రయాణించాలంటే చాలా ఖర్చవుతుంది. అందుకే ఇలా వెళ్తున్నారేమో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా రిస్క్ తీసుకుని ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దంటూ ఇంకొందరు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..