Rashi Phalalu: తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందుల్లో పడుతారు.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు..

Horoscope Today(16 June): జ్యోతిష్య శాస్త్రం మేరకు ఈ రోజు మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా?  ఆర్థిక, ఆరోగ్యపరంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? కుటుంబంలో ఎవరికి సానుకూల వాతావరణం నెలకొంటుంది? తదితర అంశాలను తెలసుకునేందుకు 12 రాశుల వారికి రాశిఫలాలు ఇలా..

Rashi Phalalu: తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందుల్లో పడుతారు.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు..
Horoscope 16th June 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jun 16, 2023 | 5:00 AM

Horoscope Today (16 June): జ్యోతిష్య శాస్త్రం మేరకు ఈ రోజు మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా?  ఆర్థిక, ఆరోగ్యపరంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? కుటుంబంలో ఎవరికి సానుకూల వాతావరణం నెలకొంటుంది? తదితర అంశాలను తెలసుకునేందుకు 12 రాశుల వారికి రాశిఫలాలు ఇలా..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభపరిణామం చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగం మారటానికి చేసిన లేదా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు చేతికి అంది వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించినంత పురోగతి కనిపిస్తుంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశి వారికి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా మంచి పురోగతి కనిపిస్తోంది. అధికార యోగానికి అవకాశం ఉంది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాల వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ రాశి వారికి అన్ని విధాలుగాను సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు దూరప్రాంతంలో మంచి కంపెనీలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అపార్థాలకు అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడం వల్ల చిక్కుల్లో పడే సూచనలు ఉన్నాయి. ఎవరినైనా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రాశివారు తీసుకునే నిర్ణయాలకు, ఇచ్చే సలహాలకు విలువ ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగం మారటానికి ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్తలు వింటారు. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని సునాయాసంగా పరిష్కరించుకుంటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తు న్నప్పటికీ అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడటం జరుగుతుంది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. గతంలో సహాయం పొందిన వారు ఇప్పుడు ముఖం చాటే యడం జరుగుతుంది. ఉద్యోగంలో మధ్యమధ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
  7. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఇతరులకు స్తోమతకు మించి సహాయం చేయడం మంచిది కాదు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో అనుకోకుండా అపార్ధాలు చికాకులు తలెత్తే ప్రమాదం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది.
  8. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశి వారికి కొద్దిగా ఆలస్యంగానే అయిన ప్పటికీ తలచిన పనులన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా మనసులోని కోరికలు నెరవేరటం జరుగుతుంది. కొత్త నిర్ణయాలు కొత్త ఆలోచన లకు ఇది చాలా మంచి సమయం. ఆర్థిక లావా దేవీల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన దాని కంటే ఎక్కువగా అభివృద్ధి కనిపిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
  9. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఈ రాశి వారికి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది కానీ ఉద్యోగంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. అధికారుల నుంచి, సహచరుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. అదనపు బాధ్యతలు మీద పడ తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. పొదుపు పాటిం చడం మంచిది. పెళ్లి ప్రయత్నాలలో చికాకులు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాల వారికి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి.
  10. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ రాశి వారికి అన్ని విధాలుగాను సమయం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారి సలహాలు, సూచనలు అధికారులకు లేదా యజమానులకు ఎంతగానో ఉపయోగపడ తాయి. మంచి పెళ్లి సంబంధం అప్రయత్నంగా కుదురుతుంది. రియల్ ఎస్టేట్, రాజకీయాలలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభించడంతోపాటు అందలాలు ఎక్కడానికి అవకాశం ఉంది. దూరప్రాంతం నుంచి మంచి శుభవార్తలు అందుతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి.
  11. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): ఈ రాశి వారికి ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం ఆశించినంతగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది. మధ్య మధ్య ప్రయాణాలు తప్పక పోవచ్చు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. చిన్నపాటి ప్రమోషన్ కూడా సంపాదించడం జరుగుతుంది. బంధుమిత్రులతో అపార్ధాలు తలెత్తే ప్రమాదం ఉంది. వృత్తిపరంగా కొత్త అవకాశాలకు అవకాశం ఉంది.
  12. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా చక్కబడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలు, ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను తలకెత్తుకోవాల్సి వస్తుంది. పని భారం బాగా పెరుగుతుంది.
  13. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశి వారు శుభకార్యాల మీద ఎక్కు వగా ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి గౌరవ మర్యాదలు పొందుతారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు నాలుగైదు ఆఫర్లు చేతికి అంది వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి నిపుణులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సామరస్యంగా సాగిపోతుంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు