AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Vakri: కుంభరాశిలోని శనీశ్వరుడికి వక్రగతి.. ఆ రాశివారికి ఆకస్మిక ధన యోగం పక్కా.. ! మీ రాశికి ఎలా ఉందంటే..?

ప్రస్తుతం శనీశ్వరుడు వక్రగతి పట్టడం వల్ల కుంభరాశిలో తాను ఇవ్వవలసిన ఫలితాలను వేగంగా త్వరగా ఇవ్వటం జరుగుతుంది. సాధారణంగా నెమ్మదిగా మందకొడిగా నడిచే శనీశ్వరుడు తన నడకలో వేగం పెంచడం జరుగుతుంది. వివిధ రాశుల మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. 

Shani Vakri: కుంభరాశిలోని శనీశ్వరుడికి వక్రగతి.. ఆ రాశివారికి ఆకస్మిక ధన యోగం పక్కా.. ! మీ రాశికి ఎలా ఉందంటే..?
Shani Dev
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 14, 2023 | 12:16 PM

Share

Astrology in Telugu: జూన్ 18వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు శనీశ్వరుడు తన స్వక్షేత్రమైన కుంభరాశిలో వక్రించడం జరుగుతోంది. ఏదైనా గ్రహం వక్రించడం అంటే గ్రహరాజు అయిన సూర్యుడి అధికార పరిధి నుంచి దూరంగా జరగటం అన్నమాట. అంటే కొద్దిగా స్వతంత్రంగా వేగంగా వ్యవహరించడం ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం శనీశ్వరుడు వక్రగతి పట్టడం వల్ల కుంభరాశిలో తాను ఇవ్వవలసిన ఫలితాలను వేగంగా త్వరగా ఇవ్వటం జరుగుతుంది. సాధారణంగా నెమ్మదిగా మందకొడిగా నడిచే శనీశ్వరుడు తన నడకలో వేగం పెంచడం జరుగుతుంది. వివిధ రాశుల మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది.

  1. మేష రాశి: ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా, సంపాదన పరంగా పురోగతి వేగం పుంజుకుంటుంది.  శని లాభ స్థానంలో ఉన్నప్పటికీ ఇంతవరకు దాని ఫలితాలు అనుభవానికి రానివారు ఇప్పుడు తప్పకుండా సానుకూల మార్పులను చవి చూస్తారు. వీరికి దక్కవలసిన అధికారం లేదా ప్రమోషన్లు ఆదాయం సంపద వీరికి తప్పకుండా దక్కడం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ ఫలితాలన్నీ వృత్తి వ్యాపారాల వారికి కూడా యధా తధంగా వర్తిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యంలో చాలా మంచి మార్పు చోటు చేసుకుంటుంది.
  2. వృషభ రాశి: ఈ రాశి వారికి దశమ స్థానంలో సంచరిస్తున్న శనీశ్వరుడివల్ల ఉద్యోగ పరంగా తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు మందకొడిగా సాగు తున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందు కోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఊహించని పురోగతి అనుభవానికి వస్తుంది. ఈ నాలుగు నెలల కాలంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దాని కంటే ఎక్కువగా స్థిరత్వం లభిస్తుంది. పెండింగ్ పనులన్నీ పూర్తి అవుతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ఈ రాశి వారి ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
  3. మిధున రాశి: ఈ రాశి వారికి భాగ్య స్థానంలో సంచరిస్తున్న శనీ శ్వరుడు వక్రగతి పట్టడం వల్ల దూర ప్రాంతంలో ఉద్యోగం, విదేశీయానం, వీసా సమస్యల పరి ష్కారం, విదేశీ సంస్థలలో ఉద్యోగం, తండ్రి నుంచి సంపద, పిల్లల పురోగతి, శుభవార్త శ్రవణం, శుభ పరిణామాలు వంటివి అతి వేగంగా చోటుచేసు కునే అవకాశం ఉంది. శనీశ్వరుడు వక్రగతిలో ఉన్న సమయంలో ఒకటికి రెండుసార్లు శివార్చన చేయించడం చాలా మంచిది. ఉద్యోగ పరంగా ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తిరీత్యా తోడు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేస్తున్న వృత్తిలో క్షణం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది.
  4. కర్కాటక రాశి: ఈ రాశి వారికి అష్టమ శని జరుగుతున్నందువల్ల కొద్దిగా జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహారాలు నిర్వహించడం మంచిది. కొందరు వ్యక్తులు తప్పు దోవ పట్టించే అవకాశం ఉంది. భారీగా డబ్బు నష్టం జరగవచ్చు. అనుకున్న పనులు అనుకు న్నట్టుగా పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, బాగా ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. వాగ్దా నాలు చేయటం, హామీలు ఉండటం, సంతకాలు పెట్టడం వంటి విషయాలలో ఆచితూచి వ్యవహ రించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అదనపు బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. అయితే శుభకార్యాలు జరగటం శుభవార్తలు వినటం వంటివి తప్పకుండా జరుగుతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: సప్తమ స్థానంలో శని వక్రించటంవల్ల దాంపత్య జీవితంలో మనస్పర్ధలు, అపార్ధాలు, పొర పచ్చాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. కుటుంబ విషయా లలో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో స్నేహితులను సైతం గుడ్డిగా నమ్మటం మంచిది కాదు.  ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పెళ్లి  ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది. అధికారులతో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
  7. కన్యా రాశి: మీ రాశి వారికి ఆరవ స్థానంలో శని వక్ర గతి పట్టడం వల్ల శత్రు రోగ రుణ బాధలు చాలావరకు వెనక పట్టు పట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రోగులకు సరైన వైద్యం, సరైన మందులు అందే సూచనలున్నాయి. అనుకోకుండా ఆదాయం పెరిగి ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అపనిందలు వేసిన వారు, దుష్ప్రచారాలు సాగించినవారు మిత్రులుగా మారే అవకాశం ఉంది.  ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు తగిన ఉద్యోగం లభిస్తుంది. సంతానపరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది.
  8. తులా రాశి: ప్రస్తుతం పంచమ స్థానంలో సంచరిస్తున్న శని వక్రగతి పట్టడం వల్ల ఈ రాశి వారికి జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. పిల్లల విషయంలో శుభ వార్తలు వినడం జరుగుతుంది. ఈ రాశి వారి ఆలోచనలు, నిర్ణయాలు, వ్యూహాలు సత్ఫలితా లను ఇస్తాయి. ఎంత పాజిటివ్ గా వ్యవహరిస్తే అంతగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో సంపాదన ఆశించిన దాని కంటే ఎక్కువగా పెరుగుతుంది. సేవా కార్యక్రమాలు నిర్వహించడం లేదా పాల్గొనడం, దానధర్మాలు చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది.  ఈ రాశికి చెందిన డాక్టర్లు విశేషంగా గౌరవ మర్యాదలు పొందుతారు.
  9. వృశ్చిక రాశి: ఈ రాశి వారికి శనీశ్వరుడు నాలుగవ స్థానంలో వక్రగతి పట్టడం వల్ల ఒకటి రెండు ముఖ్యమైన కుటుంబ సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. గృహ వాహన సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. శుభవార్తలు వింటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సరైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. బంధుమిత్రులకు అండగా నిలబడతారు.
  10. ధనూ రాశి: ఈ నెల 18 నుంచి తృతీయ స్థానంలో శని మరింత బలవంతుడు కావడం వల్ల ఈ రాశి వారికి అదృష్ట యోగం పట్టడం జరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలలో విజయాలు చేకూరుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. విహార యాత్రలు, తీర్థయాత్రలు ఎక్కువగా చేసే సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లలు పురోగతి చెందుతారు. చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగుపడుతుంది.
  11. మకర రాశి: ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ శనీశ్వరుడి వక్రగతి వల్ల దీని ప్రభావం అంతగా కనిపించకపోవచ్చు. ఆకస్మిక ధన లాభానికి, ధన యోగానికి ఎంతగానో అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధంగా ఇటువంటి ప్రయత్నం చేసినా అది సత్ఫలితాలను ఇస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావచ్చు. స్త్రీ మూలక ధన లాభానికి లేదా అదృష్టానికి అవకాశం ఉంది ఉంది. కుటుంబ పరంగా ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది.
  12. కుంభ రాశి: ఈ రాశిలో శని వక్రించడం వల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు బాగా తగ్గుముఖం పడ తాయి. రహస్య శత్రువులతో ఇబ్బంది పడటం జరుగుతుంది. లేనిపోని ప్రచారాలు జరిగే అవ కాశం ఉంది. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా లేదా వృత్తిపరంగా శ్రమ ఒత్తిడి ఎక్కువ కావడం టెన్షన్లు పెరగటం వంటివి జరగవచ్చు. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండటం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు.
  13. మీన రాశి: వ్యయ స్థానంలో సంచరిస్తున్న శనీశ్వరుడు వక్రగతి పట్టడం వల్ల ఆదాయం పెరగటం, ఖర్చులు తగ్గటం, పొదుపు పాటించడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, తీర్థయాత్రలకు వెళ్లడం వంటివి జరుగుతాయి. శుభవార్త శ్రవణం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగ పరంగాను, కుటుంబ పరంగాను ఆచితూచి వ్యవహరించడం, వీలైనంత తక్కువగా మాట్లాడటం వంటివి చేయాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు విదేశాలు సందర్శించే అవకాశం ఉంది. కొందరు స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు బాగా తగ్గిపోయే సూచనలు ఉన్నాయి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..