గ్రహ దోషాలకు రంగులతో విరుగుడు.. ఈ కలర్ డ్రెస్ ధరిస్తే ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి..!

జ్యోతిష్య శాస్త్రంలో వివిధ గ్రహాలకు వివిధ రంగులను అనుకూలమైనవిగా చెప్పడం జరిగింది. గ్రహాల దశలు అంతర్దశలను బట్టి, లగ్నంలో లేదా రాశిలో ఉన్న గ్రహాన్ని బట్టి, గోచారంలో రాసి మీదుగా వెళుతున్న గ్రహాన్ని బట్టి ఈ రంగులు ఉపయోగించడం వల్ల శుభ ఫలితాలు లేదా సానుకూల ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

గ్రహ దోషాలకు రంగులతో విరుగుడు.. ఈ కలర్ డ్రెస్ ధరిస్తే ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి..!
Planets and Favorite colours
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 12, 2023 | 10:19 AM

జ్యోతిష్య శాస్త్రంలో వివిధ గ్రహాలకు వివిధ రంగులను అనుకూలమైనవిగా చెప్పడం జరిగింది. గ్రహాల దశలు అంతర్దశలను బట్టి, లగ్నంలో లేదా రాశిలో ఉన్న గ్రహాన్ని బట్టి, గోచారంలో రాసి మీదుగా వెళుతున్న గ్రహాన్ని బట్టి ఈ రంగులు ఉపయోగించడం వల్ల శుభ ఫలితాలు లేదా సానుకూల ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రంగులకు సంబంధించిన దుస్తులను ధరించడం, అటువంటి రంగుల వాహనాలను కొనుగోలు చేయడం, ఇతరత్రా ఏదో విధంగా ఆ రంగులను ఉపయోగించడం వల్ల గ్రహ దోషాలు నివారణ అయి, అనుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయని శాస్త్రం చెబుతోంది.

  1. రవి గ్రహం: జాతక చక్రం ప్రకారం రవి దశ లేదా రవి అంతర్దశ జరుగుతున్న వారు, గోచారంలో రాశిలో రవి సంచారంలో ఉన్న వారు ఎరుపు, తెలుపు, పింక్, గోధుమ రంగులను ఎక్కువగా వాడటం వల్ల అనుకున్న పనులు త్వరగా పూర్తి కావడం జరుగుతుంది. రవి గ్రహానికి ఇష్టమైన ఈ రంగుల తో దుస్తులను ధరించడం వల్ల కూడా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. దుస్తులలో ఈ రంగులలో ఏదో ఒక రంగు ఉంటే సరిపోతుంది. కొద్దిగా షేడ్ ఉన్నప్పటికీ మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. శుభకార్యాలు తలపెట్టి నప్పుడు, ముఖ్యమైన పనులకు బయటికి వెళు తున్నప్పుడు ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల ఆ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.
  2. చంద్ర గ్రహం: పైన పేర్కొన్న విధంగానే జాతకుడికి చంద్ర గ్రహంతో సంబంధం ఏర్పడినప్పుడు, తెలుపు, గోధుమరంగు దుస్తులను ధరించడం వల్ల, ఈ రంగులను ఇతరత్రా ఏదో విధంగా ఉపయోగించడం వల్ల సానుకూల ఫలితాలు తప్పకుండా సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులు ప్రయాణాలు లావాదేవీలు ఒప్పందాలు వంటివి విజయవంతం కావాలంటే ఈ రంగులను ఉపయోగించడం చాలా మంచిది. చివరికి వైద్యం కోసం వెళుతున్నప్పుడు కూడా ఈ రకమైన రంగులను వాడటం వల్ల శుభవార్తలు వినటం, ఉపశమనం కలగటం వంటివి జరిగే అవకాశం ఉంటుంది.
  3. కుజ గ్రహం: జాతకం ప్రకారం కుజ దశ జరుగుతున్నప్పుడు లేదా గోచారంలో రాశి మీద నుంచి కుజ గ్రహం వెళుతున్నప్పుడు తప్పనిసరిగా ఎరుపు లేదా పింక్ లేదా మెజెంతా రంగుల దుస్తులను ధరించడం వల్ల ముఖ్యమైన పనులు విజయవంతంగా, నిరాటంకంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ రంగులతో ఉన్న వాహనాలను ఉపయోగించడం వల్ల కూడా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యమైన లావాదేవీ లకు అత్యవసర పనులకు శుభకార్యాలకు ఈ రంగుల దుస్తులతో వెళ్లడం వల్ల ఆశించిన విధంగా కార్యాలు కార్యక్రమాలు పూర్తి అవ్వడం జరుగుతుంది.
  4. రాహు గ్రహం: కాఫీ రంగు, నేరేడు పండు రంగు, తెలుపు రంగు ఈ గ్రహానికి చాలా ఇష్టమైనది. జాతకులకు లేదా రాశులకు రాహు గ్రహంతో సంబంధం ఏర్పడిన ప్పుడు ఈ రంగు దుస్తులను ఎక్కువగా ధరిం చడం మంచిది. దుస్తులలో ఈ రంగులు ఎక్కడో అక్కడ ఉన్నప్పటికే అవే శుభ ఫలితాలు అను భవానికి వస్తాయి. ఉద్యోగాలకు దరఖాస్తులు పెడుతున్నప్పుడు, బ్యాంకు వ్యవహారాల కోసం వెళతున్నప్పుడు, ముఖ్యమైన ఒప్పందాలు కుదర్చుకుంటున్నప్పుడు, వైద్యానికి లేదా శస్త్రచికిత్సకు వెళుతున్నప్పుడు, విద్యాసంస్థలో చేరుతున్నప్పుడు తప్పనిసరిగా ఈ రంగులను వాడటం చాలా మంచిది.
  5. ఇవి కూడా చదవండి
  6. గురు గ్రహం: గురు గ్రహానికి తెలుపు, గోధుమ రంగు, పసుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ రంగులతో దుస్తులు ధరించినా లేక వాహనాలను ఉపయో గించినా సంబంధిత రాశుల వారికి తప్పకుండా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. శుభ కార్యాలను ఫిక్స్ చేస్తున్నప్పుడు, దూర ప్రయాణా లకు వెళుతున్నప్పుడు, ఆర్థిక ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు, వృత్తి ఉద్యోగాల్లో కొత్తగా ప్రవేశిస్తున్నప్పుడు, విద్యాసంస్థల్లో చేరుతున్న ప్పుడు ఈ రంగుల ను ఏదో విధంగా వాడటం వల్ల తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. గురు గ్రహంతో సంబంధం ఏర్పడినప్పుడు ఈ రంగులను వాడటం వల్ల ప్రతి ప్రయత్నం సానుకూలం అవుతుంది.
  7. శని గ్రహం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడికి నలుపు, నీలం, పసుపు రంగులు అంటే చాలా ఇష్టం. శనీశ్వరుడి ప్రభావం ఉన్న జాతకులు లేదా రాశి వారు ఈ రంగుల దుస్తులను ధరించడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహానికి గురవుతారు. ఏ పని తలపెట్టినప్పటికీ ఆలస్యం కాకుండా, నిరాటం కంగా అది విజయవంతం కావడానికి ఈ రంగులు దోహదం చేస్తాయి. శుభకార్యం నిమిత్తం బయటకు వెళుతున్నప్పుడు, కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు, ఏదైనా ముఖ్య కార్యం తలపెట్టినప్పుడు, సొంతగా ఇంటిని లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ రంగు దుస్తులను వాడటం వల్ల సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి.
  8. బుధ గ్రహం: ఈ గ్రహానికి పచ్చ, పసుపు, గోధుమ రంగులు ఎంతో ఇష్టమైన రంగులు. ఈ గ్రహంతో సంబంధం ఏర్పడిన జాతకాల వారు ఈ రంగులను వాడటం వల్ల బుధ గ్రహం ఎంతగానో వీరికి సహాయ సహ కారాలు అందిస్తుంది. ఈ రంగులను వీలైనంత ఎక్కువగా ఉపయోగించడం వల్ల విద్య, వైద్యం, ఉద్యోగం, ఆర్థిక ప్రయత్నాలు తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. దూర ప్రయాణాలు లేదా విదేశీ యానం, విహారయాత్రల సమయంలో కూడా ఈ రంగులను వాడటం వల్ల సానుకూల ఫలితాలు శుభ ఫలితాలు అనుభవా నికి వస్తాయి. చికిత్స, ప్రసవ సమయాల్లో కూడా ఈ రంగులు అనుకూల ఫలితాలను ఇస్తాయి.
  9. కేతు గ్రహం: ఈ గ్రహానికి లేత ఎరుపు, తెలుపు, పసుపు రంగులు ఎంతో ఇష్టమైన రంగులు. కేతు దశ కేతు అంతర్దశ జరుగుతున్న వారు, గ్రహచారం ప్రకారం కేతువుతో సంబంధం ఏర్పడిన జాత కులు ఈ రంగులను వాడటం వల్ల ముఖ్యంగా ఈ రంగుల దుస్తులను ధరించడం వల్ల కేతు సంబంధమైన అనేక దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు విజయవంతం కావాలన్నా, ఆధ్యాత్మిక సాధనలో ఏర్పడుతున్న ఆటంకాలు తొలగిపోవాలన్నా, పిల్లలకు సంబంధించిన సమస్యలు ఏవైనా పరిష్కారం కావాలన్నా ఈ రంగుల దుస్తులను ధరించడం లేదా ఈ రంగులను ఎక్కువగా వాడటం వల్ల తప్పకుండా సానుకూల ఫలితాలను పొందడం జరుగుతుంది.
  10. శుక్ర గ్రహం: శుక్ర గ్రహానికి పసుపు, పచ్చ, గోధుమ, తెలుపు రంగులు అంటే చాలా ఇష్టం. విహారయాత్రలు, విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు, శృంగార సంబంధ మైన కార్యకలాపాలు, ప్రేమలు, శుభకార్యాలకు ఈ రంగులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల విజయం సాధించటం సానుకూల పరిస్థితులు ఏర్పడటం వంటివి తప్పకుండా జరుగుతాయి. జాతక చక్రం ప్రకారం శుక్ర దశ జరుగుతున్న ప్పుడు లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు గ్రహచారం ప్రకారం రాశిలో శుక్రుడు సంచరిస్తున్నప్పుడు ఈ రంగులను ఎక్కువగా వాడటం వల్ల తప్పకుండా శుభ ఫలితాలు అదృష్టం అనుభవానికి వస్తాయి. ఈ రంగులను శరీరం మీద ఏ విధంగా ఉపయో గించినప్పటికీ శుభ ఫలితాలు సిద్ధిస్తాయి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!