Weekly Horoscope(11 – 17 జూన్): వారికి అధికార యోగం పట్టనుంది.. 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Weekly Horoscope (11th - 17th June 2023): ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రేమ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇలాంటి పూర్తి వివరాలతో 12 రాశుల వారికి ఆదివారం (జూన్ 11వ తేదీ)నుంచి శనివారం (జూన్ 17వ తేదీ) వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Weekly Horoscope(11 - 17 జూన్): వారికి అధికార యోగం పట్టనుంది.. 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Weekly Horoscope (11-17 June 2023)
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Basha Shek

Updated on: Jun 11, 2023 | 5:34 AM

Weekly Horoscope (11th – 17th June 2023): ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రేమ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇలాంటి పూర్తి వివరాలతో 12 రాశుల వారికి ఆదివారం (జూన్ 11వ తేదీ)నుంచి శనివారం (జూన్ 17వ తేదీ) వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): అనుకోకుండా ఒక మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందుతుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వహించాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువులకు అండగా నిలబడతారు. ఒక శుభకార్యం నిర్వహించడం జరుగుతుంది. దగ్గర బంధువులు ఒకరు అనారోగ్యానికి గురయ్యే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆరోగ్యం పర్వాలేదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలు కనిపిస్తాయి. కుటుంబ సమస్యల విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. వివాదాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. స్నేహితుల ద్వారా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. మీ స్తోమతకు మించి ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు చికాకు కలిగిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): నిరుద్యోగులు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. అదనపు ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంది. జీవిత భాగస్వామికి స్వల్పంగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ప్రయాణాల్లో డబ్బు నష్టం జరుగుతుంది. కుటుంబ సంబంధమైన విషయాల్లో జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా సాగిపోతుంది. సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి యధాతధంగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువులు అండగా నిలబడతారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆదాయ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలవల్ల ప్రయోజనం ఉంటుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. సొంత ఇంటి కల నెరవేరే సమయం అనుకూలంగా ఉంది. చిన్న పాటి అనారోగ్యం నుంచి కోలుకుంటారు. పిల్లలు పురోగతి చెందుతారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న సమా చారం అందుతుంది. పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. అంతా మన మంచికే అనుకోవడం మంచిది. చిన్ననాటి మిత్రులు కలుసుకుంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య సమస్య ఒకదానికి పరిష్కారం కనిపిస్తుంది. అధికారులు మీ ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలకు చెందినవారు బిజీ అయిపోతారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. బంధువులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితురాలి మీద బాగా ఖర్చవుతుంది. ఇతరులకు బాగా ప్రయోజనం కలిగించే పనులు చేస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. తిప్పట, శ్రమ ఎక్కువగా ఉంటాయి. అతి కష్టం మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. కొందరు బంధువులతో అపార్ధాలు చోటు చేసుకుంటాయి. స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. కుటుంబంలోని పెద్దలు చాలా వరకు అండగా నిలబడతారు. ఐటీ వంటి వృత్తి నిపుణులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో బాగా నిలదొ క్కుకుంటారు. వృత్తి నిపుణులకు సమయం ఎంతో అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్లకు క్షణం తీరిక లేకుండా ఉంటుంది. శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఉద్యోగ పరంగా స్థిరత్వం లభిస్తుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం పట్టవచ్చు. వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకుని వదిలేసుకున్న బాకీలు చేతికి వస్తాయి. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక పరిస్థితి నిలకడగా నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఒకటి రెండు కుటుంబ సమస్యలు చికాకు పెడతాయి. బంధువుల సహాయంతో ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరించుకుంటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. మీకు డబ్బులు చెల్లించవలసిన వాళ్లు ముఖం చాటేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి శ్రమఎక్కువవుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. అధికారులు, సహచరులు సహాయ సహకారాలు అందిస్తారు. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. శుభకార్యాల మీద ఖర్చు చేస్తారు. బంధు మిత్రులతో విహారయాత్రకు బయలుదేరుతారు. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాల వారు లాభాలపరంగా నిలదొక్కుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ఐటీ రంగానికి చెందినవారు ఆర్థికంగా ముందుకు వెళతారు.తిప్పట, శ్రమ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం అని గ్రహించండి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పొదుపు సూత్రాలను పాటిస్తారు. ఇప్పట్లో ఉద్యోగం మారటానికి అవకాశం లేదు. పెళ్లి ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. అతికష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆదాయపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అదనపు ఆర్థిక ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సానుకూల స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఐటి రంగంలో వారికి మంచి కంపెనీ నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి వాతావరణం సామరస్యంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం పర్వాలేదు.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..