- Telugu News Photo Gallery Spiritual photos Lucky Zodiacs: these 5 Zodiac signs will get relief from all tension and receive immense profits, says Astro Experts
Sunday Lucky Zodiacs: ఈ రాశులవారికి ధనలాభం, వ్యాపారంలో విజయం.. నేటి ఆదృష్ట రాశులివే..!
June 11 Lucky Zodiacs: ఈ ఆదివారం నవగ్రహాలు కూడా కొన్ని రాశులవారికి ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా రాశిచక్రంలోని ఆయా రాశులవారి జీవితాల్లోకి అదృష్టం రానుంది. ఈ క్రమంలో ఈ ఆదివారం ఏయే రాశులవారికి శుభఫలితాలను, ధనప్రాప్తిని కలిగిస్తుందో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jun 12, 2023 | 6:42 PM

మేష రాశి: ఈ ఆదివారం నవగ్రహాలు మీకు ఎంతో అనుకూలంగా ఉండనున్నాయి. ఫలితంగా మిమ్మల్ని అదృష్టం వెంటాడుతుంది. ఇంకా ఆదాయంలో పెరుగుదల, సామాజికంగా కీర్తి, వ్యాపారంలో లాభం కలుగుతాయి. అయితే పెట్టుబడి విషయంలో ఆలోచనాత్మకంగా ఉండాలి.

వృషభ రాశి: మిమ్మల్ని ఎంతో కాలంగా వెంటాడుతున్న పాత చింతలు ఈ రోజు దూరమైపోతాయి. శారీరక ఆరోగ్యం, కుటుంబ ఆనందం, సంతృప్తి కలుగుతాయి. అలాగే వ్యాపారంలో విజయం, చేసిన పనికి తగిన ఫలితం దక్కుతాయి.

కన్య రాశి: ఈ ఆదివారం మీకు ఎంతో అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. చేసిన ప్రతి పనిలో విజయం, మానసికం ప్రశాంతత లభిస్తాయి. అయితే భాగస్వామితో వాగ్వాదానికి దూరంగా ఉండడం మీ భవిష్యత్‌కు చాలా మంచిది.

తులా రాశి: జూన్ 11వ తేదీ తులా రాశివారికి కూడా అదృష్టాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా తులారాశికి చెందని ఉద్యోగులకు ఇది చక్కని రోజు. మీకు ఉద్యోగోన్నతి, ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు ధన లాభం, సంతాన యోగం కలుగుతాయి.

ధనుస్సు రాశి: ధనస్సు రాశివారికి ఈ ఆదివారం ఎంతో శుభఫలితాలను ఇస్తుంది. మిత్రులతో ఉన్న పాత గొడవలు తొలగిపోతాయి. శత్రువులతో సానుకూల వాతావరణాన్ని ఏర్పరుచుకుంటారు. అయితే ఈ రాశికి చెందని స్త్రీలు ఈ రోజు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది.




