Sun Transit 2023: మిథునంలోకి ప్రవేశించిన సూర్యుడు.. ఈ రాశులవారి జీవితాల్లో ధన ప్రవాహం ఖాయం..

Sun Transit 2023: సనాతన హిందూ ధర్మంలో కనిపించే ప్రత్యక్ష దైవంగా, అలాగే జ్యోతిష్యంలో గ్రహాల రారాజుగా సూర్యుడు ప్రసిద్ధి. జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల కదలికలు రాశిచక్రంలోని రాశులపై ప్రతికూల, అనుకూల ప్రభావాలను చూపిస్తాయన్నసంగతి..

Sun Transit 2023: మిథునంలోకి ప్రవేశించిన సూర్యుడు.. ఈ రాశులవారి జీవితాల్లో ధన ప్రవాహం ఖాయం..
Sun Transit 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 16, 2023 | 7:45 AM

Sun Transit 2023: సనాతన హిందూ ధర్మంలో కనిపించే ప్రత్యక్ష దైవంగా, అలాగే జ్యోతిష్యంలో గ్రహాల రారాజుగా సూర్యుడు ప్రసిద్ధి. జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల కదలికలు రాశిచక్రంలోని రాశులపై ప్రతికూల, అనుకూల ప్రభావాలను చూపిస్తాయన్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూర్యుడు జూన్ 15న అంటే నిన్న మిథున రాశిలోకి ప్రవేశించాడు. ఇంకా వచ్చే నెల 16వ తేదీ వరకు కూడా మిథునంలోనే సూర్యుడు సంచరించనున్నాడు. ఇలా మిథున రాశిలోకి సూర్యుడు ప్రవేవించి, అక్కడే నెల రోజుల పాటు సంచరించడం వల్ల రాశిచక్రంలోని కొన్ని రాశులకు అదృష్టం వరించబోతోంది. ఫలితంగా ఆ రాశులకు ఈ సమయంలో ఎన్నో రకాలుగా లాభాలు, సుఖసంతోషాలు కలగనున్నాయి. ఇంతకీ ఆ రాశులేమిటో ఇప్పుడు చూద్దాం..

కుంభ రాశి: మిథున రాశిలో సూర్య సంచారం కుంభరాశివారికి ధన, సంతాన ప్రాప్తికి కారణం కానుంది. ఇంకా ఈ సమయంలో కుంభరాశిలో జన్మించినవారికి కీర్తిప్రతిష్టలతో పాటు వ్యాపార లాభాలు కలగనున్నాయి. అంతేకాక ఈ రాశికి చెందిన విద్యార్థులను ఉద్యోగావకాశాలు వరించబోతున్నాయి.

మిథున రాశి: మిథునంలోనే సూర్య సంచారం జరుగుతున్నందున ఈ సమయంలో ఈ రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. చేయి పెట్టిన ప్రతిపనిలో విజయం, వ్యాపారాభివృద్ధి పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగులకు ఈ సమయం ప్రమోషన్ తెచ్చేదిగా ఉంది. అయితే ఈ సమయంలో మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా మంచింది.

ఇవి కూడా చదవండి

కన్యారాశి: సూర్య గ్రహ మిథున సంచారం కన్యారాశివారికి శుభప్రదంగా ఉంది. ఈ సమయంలో మీ వివాదాలన్ని పరిష్కృతమవుతాయి. ఇంకా మీ రాబడి ఈ సమయంలో ద్విగుణీకృతం అవుతుంది. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మొత్తానికి ఈ సమయంలో మీ జీవితంగా సుఖసంతోషాలతో విలసిల్లుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా