Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friday Puja Tips: శుక్రవారం ఈ పనులు చేసి చూడండి .. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు..

శుక్రవారం రోజున కొన్నిపనులు చేయడం వలన ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదలకు లోటు ఉండదు. శుక్రదేవుని అనుగ్రహం కూడా ఉంటుంది. కనుక ఈ రోజు మనం ఈ రోజు శుక్రవారం రోజున చేయాల్సిన పనులు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..

Friday Puja Tips: శుక్రవారం ఈ పనులు చేసి చూడండి .. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు..
Friday Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Jun 16, 2023 | 7:08 AM

సనాతన హిందూ సంప్రదాయంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. అందులో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, అమ్మవారి ఆశీర్వాదాలు పొందడానికి పూర్తి నియమ నిబంధనలతో పూజిస్తారు. లక్ష్మీదేవిని నియమనిష్టలతో ఆరాధించే వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ సంపద కొరత ఉండదని నమ్మకం. అంతేకాదు శుక్రవారం కూడా శుక్రదేవుడికి అంకితం చేయబడింది. శుక్రుడు ఆనందానికి  కారకంగా పరిగణించబడతాడు. శుక్రవారం రోజున కొన్నిపనులు చేయడం వలన ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదలకు లోటు ఉండదు. శుక్రదేవుని అనుగ్రహం కూడా ఉంటుంది. కనుక ఈ రోజు మనం ఈ రోజు శుక్రవారం  రోజున చేయాల్సిన పనులు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..

శుక్రవారం రోజున ఏ పనులు చేయాలంటే: 

  1. శుక్రవారము రోజున ఐదు నాణేలు తీసుకుని కొద్దిగాపసుపు, కుంకుమను పసుపు గుడ్డలో కట్టి మీరు డబ్బులు పెట్టుకునే ప్లేస్ లో ఉంచాలి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు నివారించబడతాయి. అప్పులు కూడా తీరతాయి.
  2. శుక్రవారం సాయంత్రం ఇంటి ఈశాన్య మూలలో (పూజ చేసే స్థలంలో) ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని వత్తిలో దూదికి బదులుగా ఎరుపు రంగు కాటన్ దారం ఉండాలి, దీపం వెలిగించే సమయంలో  కుంకుమను పెట్టాలి.
  3. శుక్రవారం పేదవారికి తెల్లని వస్తువులు లేదా ఆహార పదార్థాలను దానం చేయాలి. అంతేకాదు  వికలాంగుడైన బిచ్చగాడికి లేదా ఆవుకి ఆహారం అందిస్తే అది చాలా శుభప్రదం అవుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగి సుఖ సంపదలు మీ సొంతం.
  4. శుక్రవారం నాడు ముగ్గురు పెళ్లికాని అమ్మాయిలను ఇంటికి పిలిపించి.. వారికి ఖీర్ తినిపించి, దక్షిణ (డబ్బు),  పసుపు బట్టలు వాయినం ఇచ్చి పంపండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.
  5. శుక్రవారాల్లో శ్రీ యంత్రానికి ఆవు పాలతో అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన నీటిని ఇంటింటా చల్లాలి.  శ్రీయంత్రాన్ని భద్రంగా ఉంచండి. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి.

శుక్రవారం చేయకూడని పనులు:

ఇవి కూడా చదవండి
  1. శుక్రవారం డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండాలి.
  2. శుక్రవారం ఎవరికీ పంచదార అప్పు కూడా ఇవ్వరాదు. ఇలా చేయడం వల్ల జాతకంలో శుక్రుడి స్థానం బలహీనపడుతుంది.
  3. శుక్రవారం పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పెద్దలు చెప్పారు.
  4. శుక్రవారం పొరపాటున కూడా చిరిగిన, మురికి బట్టలు ధరించవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).