ఓకే రాశిలో శని కుజ గ్రహాలు.. ఏర్పడిన షడష్టక యోగం.. ఈ 4 రాశులకు అన్నీ కష్టాలు, నష్టలే.. మీరుంటే జాగ్రత్తగా ఉండాల్సిందే..

షడష్టక యోగం కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం చూపించనున్నది. దీంతో ఈ రాశులకు చెందిన వ్యక్తు తీవ్ర దుష్ప్రభాలను ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శని, కుజుడు కలయిక వలన ఏర్పడే షడష్టక యోగం ఎంత సమయం ఉంటుంది.. ఈ యోగం వలన కష్టాలు, నష్టాలు ఎదుర్కొనే రాశుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఓకే రాశిలో శని కుజ గ్రహాలు.. ఏర్పడిన షడష్టక యోగం.. ఈ 4 రాశులకు అన్నీ కష్టాలు, నష్టలే.. మీరుంటే జాగ్రత్తగా ఉండాల్సిందే..
Shadashtak Yoga
Follow us
Surya Kala

|

Updated on: Jun 16, 2023 | 8:41 AM

మనిషి జాతకంపై గ్రహాల ప్రభావంతో మంచి చెడులు ఏర్పడతాడని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.    గ్రహాలు రాశుల్లో సంచరించడం వలన ఏర్పడే యోగాలకు జ్యోతిష్యశాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహాల సంచారంతో శుభా అశుభ యోగాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో శనీశ్వరుడు కుజుడు ఒకే రాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాల కలయిక తో షడష్టక యోగం ఏర్పడిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ యోగం అశుభయోగం అని ఆర్థిక నష్టాలు, ప్రమాదాలు, కుటుంబ సమస్యలు కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ షడష్టక యోగం కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం చూపించనున్నది. దీంతో ఈ రాశులకు చెందిన వ్యక్తు తీవ్ర దుష్ప్రభాలను ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శని, కుజుడు కలయిక వలన ఏర్పడే షడష్టక యోగం ఎంత సమయం ఉంటుంది.. ఈ యోగం వలన కష్టాలు, నష్టాలు ఎదుర్కొనే రాశుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

షడష్టక యోగం ఎంతకాలం ఉంటుందంటే  షడష్టక యోగా మే 10 నుండి జూన్ 30 వరకు ఉంటుంది. షడష్టక యోగా జూలై 1వ తేదీతో ముగుస్తుంది.

కర్కాటక రాశి:

ఇవి కూడా చదవండి

షడష్టక యోగం వలన ఈ రాశివారికి తీవ్ర నష్టాలు కలిగే అవకాశాలున్నాయి. ధన నష్టం  కలగవచ్చు. ఆస్తి విషయంలో తగాదాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వలన భారీ నష్టాలు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఈ రాశికి చెందిన వ్యక్తుల  వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారి సమస్యలు మరింత తీవ్రం అవుతాయి. ముఖ్యంగా వ్యాపారస్థులపై ఈ యోగం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు సమస్యలకు  ప్రశాంతమైన మనస్సు , ఓర్పుతో ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సింహ రాశి:

ఈ అశుభయోగం ఈ రాశి వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయని  జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆదాయం తగ్గి అధిక ఖర్చు పెరుగుతాయి. ఆరోగ్య, ఆర్ధిక సమస్యలు మరింత అధికం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రాశివారు ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వృధా ఖర్చు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగాలు చేస్తున్న వారు తీవ్ర ఒత్తిడికి  లోనవుతారు. మనసు నియంత్రణ కోల్పోతారు.

ధనస్సు రాశి:

ఈ రాశి వ్యక్తులపై షడష్టక యోగం దుష్ప్రభావాలను చూపిస్తుంది.  అప్పు ఇచ్చి ముప్పు తిప్పలు పడతారు. ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడతారు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా.. పెట్టుబడులు పెట్టాలన్నా ఈ నెలాఖరు వరకూ వేచి చూడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కుంభం రాశి: 

శనీశ్వరుడు, కుజుడు కలయిక వలన ఏర్పడిన షడష్టక యోగం ఈ రాశి వ్యక్తులను తీవ్ర ప్రమాదంలో పడేస్తుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.  జీవిత భాగస్వామితో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఒత్తిడి నెలకొంటుంది.  ఆఫీసులో కోపం, ప్రవర్తనను నియంత్రించుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).