- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Neeti: Any wife should not share these things with her husband for their happy Married Life
Chanakya Neeti: భార్య తన భర్తకు చెప్పకూడని విషయాలు.. చెబితే దాంపత్య జీవితంలో కష్టాలు తప్పవంటున్న చాణక్య..
Chanakya neeti: ఎన్నో విషయాల్లో గొప్ప మేధావి అయిన ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలను చాణక్య నీతి అంటారని మనకు తెలిసిందే. చాణక్యుడు చెప్పిన మాటలు మానవ జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొవడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఈ క్రమంలో భార్యభర్తల వైవాహిక సంబంధం సంతోషంగా ఉండడానికి కూడా కొన్ని సూచనలు ఇచ్చాడు ఆచార్యుడు.
Updated on: Jun 15, 2023 | 2:18 AM

Chanakya neeti: ఎన్నో విషయాల్లో గొప్ప మేధావి అయిన ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలను చాణక్య నీతి అంటారని మనకు తెలిసిందే. చాణక్యుడు చెప్పిన మాటలు మానవ జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొవడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఈ క్రమంలో భార్యభర్తల వైవాహిక సంబంధం సంతోషంగా ఉండడానికి కూడా కొన్ని సూచనలు ఇచ్చాడు ఆచార్యుడు. వాటి ప్రకారం ఏ భర్తకు కూడా తన భార్య కొన్ని రకాల విషయాలను చెప్పకూడదట. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం..

బలహీనత: భర్తకు భార్య తన బలహీనత గురించి ఎప్పుడూ చెప్పకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. లేకుంటే భర్త ఆమె బలహీనతను తన ప్రయోజనాల కోసం వాడుకుని ఇబ్బంది పెట్టవచ్చని చాణక్యుడు సూచించాడు.

జీవితం సంక్లిష్టమైనదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ప్రతి పరిస్థితిని ఒకే సూత్రాల ద్వారా పరిష్కరించలేము. చాణక్య నీతిని అన్ని సమస్యలకు ఖచ్చితమైన సమాధానంగా కాకుండా మార్గదర్శకంగా చూడాలి. ఇది సాధారణ జ్ఞానాన్ని అందించడానికి, విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది.

బలహీనతలు- రహస్యాలు: మీ బలహీనతలను లేదా వ్యక్తిగత రహస్యాలను ఇతరులకు వెల్లడించడం వలన మీరు చేజేతులా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అని చాణక్య చెప్పారు. మీరు చెప్పిన అలాంటి సమాచారాన్ని తమ స్వలాభం కోసం కొందరు కొన్ని సమయాల్లో ఉపయోగించుకుంటారని..అప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కనుక అలాంటి విషయాలను గోప్యంగా ఉంచడం తెలివైన పని అని చాణక్యుడు నమ్మాడు.






























