Astro Tips For Saturday: శనివారం ఈ వస్తువులను కొన్నా, నల్ల బట్టలు ధరించినా దరిద్రం మీసొంతం.. ఆ వస్తువులు ఏమిటో ఓ లుక్ వేయండి..

పొద్దున్నే నిద్ర లేవాలి.. రాత్రి పడుకోవాలని ఏ విధంగా టైం ఫిక్స్ అయిందో.. అదేవిధంగా మనం చేసే ప్రతి పనికి సరైన సమయం, రోజు ఉంటుంది. ఏదైనా వస్తువును ఉపయోగించే సమయంలో లేదా కొనుగోలు చేసే సమయం దాని అవసరాన్ని బట్టి ఉంటుంది. అయితే జ్యోతిష్యంలో కూడా ఏ రోజున ఏ వస్తువు కొనుగోలు చేయాలి అన్న విషయంలో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి.

Astro Tips For Saturday: శనివారం ఈ వస్తువులను కొన్నా, నల్ల బట్టలు ధరించినా దరిద్రం మీసొంతం.. ఆ వస్తువులు ఏమిటో ఓ లుక్ వేయండి..
Astro Tips For Saturday
Follow us

|

Updated on: Jun 17, 2023 | 7:55 AM

హిందూ మత గ్రంథాలు లేదా హిందూ సనాతన సంప్రదాయంలో ప్రతి పనికి తగిన రోజు తగిన సమయం,  శుభ సమయం నిర్ణయించబడింది. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని తద్వారా పని చేస్తే అప్పుడు శుభఫలితాలు పొందుతారని విశ్వాసం. వాస్తు ప్రకారం కొన్ని రోజుల్లో కొన్ని వస్తువులను కొనడం వలన మంచిది కాదని నిషేధించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రోజున ఏ వస్తువులను కొనుగోలు చేస్తే ఏఏ ఫలితాలను ఇస్తుందో.. ఆయా రోజు ప్రకారం అవసరమైన వస్తువులను షాపింగ్ చేస్తే అది మీకు శుభాన్ని ఇస్తుంది. పొద్దున్నే నిద్ర లేవాలి.. రాత్రి పడుకోవాలని ఏ విధంగా టైం ఫిక్స్ అయిందో.. అదేవిధంగా మనం చేసే ప్రతి పనికి సరైన సమయం, రోజు ఉంటుంది. ఏదైనా వస్తువును ఉపయోగించే సమయంలో లేదా కొనుగోలు చేసే సమయం దాని అవసరాన్ని బట్టి ఉంటుంది. అయితే జ్యోతిష్యంలో కూడా ఏ రోజున ఏ వస్తువు కొనుగోలు చేయాలి అన్న విషయంలో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి.

శనివారం కొన్ని వస్తువులను కొనుగోలు చేయకూడదు.. అవి ఏమిటంటే.. 

  1. శనివారం నాడు ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు. శనివారం ఇనుప వస్తువులు కొనడం వల్ల శనీశ్వరుడికి కోపం వస్తుందని నమ్ముతారు.
  2. శనివారం ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఇనుప వస్తువులను దానం చేయడం వలన శనీశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది. వ్యాపారంలో నష్టాలు పొందుతున్నవారు లాభాల బాట పట్టిస్తారు. అంతేకాదు శనీశ్వరుడు ఏదైనా వస్తువుల వలన కలిగే ప్రమాదాల నుంచి రక్షణ కల్పిస్తాడు.
  3. ఇవి కూడా చదవండి
  4. శనివారం రోజున నూనె కొనడం అశుభం.. నూనె దానం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు. నల్ల కుక్కకు ఆవనూనెతో చేసిన పదార్ధం తినిపించడం వల్ల  శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది.
  5. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనివారం రోజున ఆవనూనె లేదా ఏదైనా పదార్థాన్ని కొనుగోలు చేసినా అనారోగ్యం బారిన పడతారు.
  6. శనివారం ఉప్పు కొనడం వలన అశుభఫలితాలను పొందుతారు. శనివారం ఉప్పు కొంటే ఆ ఇంటిలోని వ్యక్తులు అప్పులు, రోగాలబారిన పడతారు.
  7. బట్టల వ్యాపారులు, టైలర్లు తదితరులు శనివారాల్లో కొత్త కత్తెరలు కొనరు. ఈ రోజున కొనే కత్తెర బంధంలో ఇబ్బందులను కలిగిస్తుందని నమ్మకం.
  8. శనివారం నల్ల నువ్వులను కొనడం వలన చేపట్టిన పనిలో ఆటంకాలు కలుగుతాయని విశ్వాసం.
  9. శనివారం నాడు బ్లాక్ కలర్ లేదా లెదర్ షూస్ కొనకండి. శనివారం కొనుగోలు చేసిన నల్ల బూట్లు ధరించేవారికి వైఫల్యాన్ని తెస్తాయని నమ్ముతారు.
  10. శనివారం ఇంధనం కొనుగోలు చేయడం నిషేధించబడింది. శనివారం ఇంటికి తెచ్చిన ఇంధనం కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని విశ్వాసం.
  11. శని వారం చీపురు ఇంటికి కొని తెచ్చుకుంటే దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లే అని విశ్వాసం.
  12. శనివారం ధాన్యాన్ని కొనుగోలు చేయరాదు. ఇది కుటుంబంలో ఉద్రిక్తతకు దారితీస్తుందని నమ్ముతారు.
  13. కాగితం, పెన్ను మొదలైనవి శనివారం కొనకూడదు. మనిషిని అపజయాల బాట పట్టిస్తుంది.
  14. ఆహార పదార్ధాలను, సంపదకి చిహ్నమైన వాటిని శనివారంరోజున కొనుగోలు చేస్తే దరిద్రం వస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).