AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి సూర్యగ్రహణం ‘రింగ్ ఆఫ్ ఫైర్’.. ఈ రాశులకు అదృష్టం అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది.!

Solar Eclipse 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా.. దాని ప్రభావం రాశులపై నేరుగా పడుతుంది. ఫిబ్రవరి 17న ఏర్పడే సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనది. అనేక రాశుల వారికి సానుకూల మార్పులను తీసుకురావడానికి అవకాశం ఉంది. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Feb 12, 2026 | 12:00 PM

Share
ప్రతి సంవత్సరంలోనూ సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడుతుంటాయి. ఈ ఏడాదిలోనూ తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. ప్రపంచంలోని కొన్ని ప్రదేశాల్లోనే ఈ సూర్యగ్రహణం ‘అగ్ని వలయం’గా కనిపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ ఎఫెక్ట్ అంటారు. ఈ రకమైన సూర్య గ్రహణం చంద్రుడు భూమి నుంచి దాని అత్యంత సుదూర బిందువు వద్ద లేదా సమీపంలో ఉన్నప్పుడు సంభవిస్తుంది. ఫిబ్రవరి 17న తొలి సూర్య గ్రహణం.. చంద్రుడు సూర్యునికి, భూమికి మధ్యలో వెళ్లడంతో సూర్యుడు చాలా వరకు కనిపించడు. దీంతో సూర్యుడి కంటే చంద్రుడు కొంత తక్కువగా ఉండటంతో వలయంలా ఏర్పడుతుంది. నాసా ప్రకారం.. రింగ్ ఆఫ్ ఫైర్ దశ ఉదయం 7.12 గంటలకు (అమెరికా కాలం) ప్రారంభమై 1 నిమిషం 52 సెకన్లపాటు ఉంటుంది. ఈ గ్రహణాన్ని పరిమితంగానే వీక్షించవచ్చు.

1 / 6
రింగ్ ఆఫ్ ఫైర్ మార్గం అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. అక్కడ ఉండే లక్షలాది పెంగ్విన్‌లను ఈ గ్రహణం కొంత గందరగోళానికి గురిచేయవచ్చు. అంటార్కిటికాలోనూ తక్కువ సమయంపాటే సూర్య గ్రహణం కనిపించనుంది. దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహా సముద్రాలలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తుంది. భారతదేశంలో ఈ సూర్య గ్రహణం కనిపించే అవకాశం లేదు.

2 / 6
మరోవైపు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా.. దాని ప్రభావం రాశులపై నేరుగా పడుతుంది. ఈ సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనది. అనేక రాశుల వారికి సానుకూల మార్పులను తీసుకురావడానికి అవకాశం ఉంది. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 6

మేష రాశి.. 

మేష రాశి వారికి ఈ సూర్యగ్రహణం అదృష్టాన్ని అందిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ఎదురవుతాయి. పనిలో బాధ్యతలు పెరుగుతాయి, ప్రమోషన్ అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేయడం లేదా బిజినెస్ ప్రారంభించడం కోసం ఇది అనుకూల సమయం. మానసిక ఒత్తిడి తగ్గి, జీవితం సౌకర్యవంతంగా, సంతోషకరంగా ఉంటుంది.

మేష రాశి.. మేష రాశి వారికి ఈ సూర్యగ్రహణం అదృష్టాన్ని అందిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ఎదురవుతాయి. పనిలో బాధ్యతలు పెరుగుతాయి, ప్రమోషన్ అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేయడం లేదా బిజినెస్ ప్రారంభించడం కోసం ఇది అనుకూల సమయం. మానసిక ఒత్తిడి తగ్గి, జీవితం సౌకర్యవంతంగా, సంతోషకరంగా ఉంటుంది.

4 / 6

సింహ రాశి.. 

సింహ రాశి వారికి కూడా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. పని ప్రదేశంలో ప్రశంసలు, ముఖ్యమైన ప్రాజెక్టులు చేపట్టడం, పేరు మరియు ప్రతిష్ట పెరగడం జరుగుతుంది. వ్యాపారస్తులకు ఇది లాభదాయక సమయం. ఆర్థిక సమస్యలు, అప్పులు తగ్గి, పురోగతి మరియు విజయాలను అనుభవించవచ్చు.

సింహ రాశి.. సింహ రాశి వారికి కూడా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. పని ప్రదేశంలో ప్రశంసలు, ముఖ్యమైన ప్రాజెక్టులు చేపట్టడం, పేరు మరియు ప్రతిష్ట పెరగడం జరుగుతుంది. వ్యాపారస్తులకు ఇది లాభదాయక సమయం. ఆర్థిక సమస్యలు, అప్పులు తగ్గి, పురోగతి మరియు విజయాలను అనుభవించవచ్చు.

5 / 6
ధనుస్సు రాశి.. 

ధనుస్సు రాశి వారికి సూర్యగ్రహణం తర్వాత సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తోటి ఉద్యోగుల సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది, కొత్త అవకాశాలను గమనించవచ్చు. విజయవంతమైన జీవితం, ఆర్థిక లాభాలు, విదేశీ ప్రయాణాలు కూడా ఈ సమయంలో సాధ్యమవుతాయి.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి సూర్యగ్రహణం తర్వాత సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తోటి ఉద్యోగుల సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది, కొత్త అవకాశాలను గమనించవచ్చు. విజయవంతమైన జీవితం, ఆర్థిక లాభాలు, విదేశీ ప్రయాణాలు కూడా ఈ సమయంలో సాధ్యమవుతాయి. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

6 / 6