US - Iran Peace Deal Done: అమెరికా-ఇరాన్ మధ్య నాలుగు నెలల సంక్షోభం ముగిసింది. డోనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందాన్ని ప్రకటించగా, హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంది. ఎలాంటి సుంకాలు లేకుండా చమురు ట్యాంకర్లు, నౌకల ప్రయాణాలకు మార్గం సుగమమైంది. ఈ యుద్ధం వల్ల భారీ ఆర్థిక నష్టం, చమురు ధరల పెరుగుదల, సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడ్డాయి. ప్రస్తుతం శాంతి నెలకొన్నా, దాని మనుగడపై ప్రశ్నలు మిగిలాయి.