AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: స్మృతి కొట్టిన సిక్స్ చూశారా..? క్వీన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని ఊరికే అంటారా..

భారత్-పాకిస్థాన్ ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో స్మృతి మంధాన కొట్టిన అద్భుత సిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒత్తిడిని దూరం చేసే ఆ షాట్‌ను అభిమానులు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ రాణించగా, దీప్తి శర్మ ఐదు వికెట్లతో పాక్‌ను చిత్తు చేసింది.

Video: స్మృతి కొట్టిన సిక్స్ చూశారా..? క్వీన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని ఊరికే అంటారా..
Smriti Mandhana
SN Pasha
|

Updated on: Jun 15, 2026 | 11:26 AM

Share

ప్రతి రోజు ఏదో పని, ఎన్నో టెన్షన్లు.. అయినా కూడా కొంతమంది సినిమా చూస్తూనో, క్రికెట్ మ్యాచ్ చూస్తూనో అన్ని మర్చిపోయి అందులో లీనమై పోతారు. అయితే కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు.. ప్రపంచంలో ఏ మూల క్రికెట్ జరిగినా.. అందులో ఒక అద్బుతమైన షాట్, మంచి క్యాచ్, సూపర్ డెలవరీ, షార్ఫ్ ఫీల్డింగ్.. ఇలా ఏది గొప్పగా జరిగినా దాన్ని చూసి ఆస్వాదిస్తుంటారు. అలాంటి వారికి మరింత సంతోషాన్ని ఇచ్చి వీడియో ఇది. ఆ షాట్ ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించక మానదు. అంత మంచి షాట్. పైగా కొట్టింది ఎవరో కాదు.. క్వీన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ స్మృతి మంధాన.

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో మంధాన ఓ సూపర్ సిక్స్ కొట్టింది. ఆ సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. డౌన్ ది ట్రాక్ వస్తూ.. బాల్‌ను అద్బుతంగా పిక్ చేస్తూ.. లాంగ్ ఆన్‌లోకి ఎంత చూడముచ్చటగా కొట్టిందో.. ఆహా.. అలా ఎన్ని సార్లు అయినా చూడాలనిపిస్తోంది ఆ షాట్‌ను. సోషల్ మీడియాలో ఆ సిక్స్ వీడియో అయితే తెగ ట్రెండ్ అవుతోంది. ఆ షాట్ చూసిన అభిమానులు.. ఇందుకే కదా మంధానను క్వీన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనేది అంటూ మెచ్చుకుంటున్నారు. గాడ్ ఆఫ్ క్రికెట్‌గా సచిన్, కింగ్ ఆఫ్ ది క్రికెట్‌గా విరాట్, క్వీన్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్‌గా స్మృతి.. భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మంధాన 68, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులు చేసి రాణించారు. చివరల్లో రిచా ఘోష్ 17 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు చేసి సూపర్ ఫినిష్ ఇచ్చింది. ఇక 171 భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూసించారు. కేవలం 106 పరుగులకే ఆల్ అవుట్ చేసి పడేశారు. ముఖ్యంగా స్పిన్నర్ దీప్తి శర్మ 5 వికెట్ల హాల్‌తో అదరగొట్టింది. శ్రీ చరణి 3, షఫాలీ వర్మ ఒక వికెట్ తీసుకున్నారు. దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథుల కోసం పసందైన వంటకాలు
ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథుల కోసం పసందైన వంటకాలు
ఈ 4 చెడు అలవాట్లు లక్ష్మీదేవిని ఇంటి నుంచి దూరం చేస్తాయా? గరుడ..
ఈ 4 చెడు అలవాట్లు లక్ష్మీదేవిని ఇంటి నుంచి దూరం చేస్తాయా? గరుడ..
ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్‌లో పాములు.. భయంలో జనం
ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్‌లో పాములు.. భయంలో జనం
మనిషి కనిపిస్తే వేటాడేస్తారు! అక్కడికి వెళ్తే తిరిగిరారు..
మనిషి కనిపిస్తే వేటాడేస్తారు! అక్కడికి వెళ్తే తిరిగిరారు..
మీ జాతకంలో పాప కర్తరి యోగం ఉందా? ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు..
మీ జాతకంలో పాప కర్తరి యోగం ఉందా? ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు..
రామ్ చరణ్-సుక్కూ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్!  వద్దంటోన్న ఫ్యాన్స్
రామ్ చరణ్-సుక్కూ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్!  వద్దంటోన్న ఫ్యాన్స్
పాత బంగారం విక్రయానికి జనం పరుగులు! మోదీ వ్యూహం ఫలిస్తోందా?
పాత బంగారం విక్రయానికి జనం పరుగులు! మోదీ వ్యూహం ఫలిస్తోందా?
25 ఏళ్ల అక్షరధామ్ ఆలయం.. 20 వేల శిల్పాలు, 108 అడుగుల విగ్రహం..
25 ఏళ్ల అక్షరధామ్ ఆలయం.. 20 వేల శిల్పాలు, 108 అడుగుల విగ్రహం..
3 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన.. 6 రోజులపాటు ద్వైపాక్షిక చర్చలు
3 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన.. 6 రోజులపాటు ద్వైపాక్షిక చర్చలు
బాలకృష్ణ విలన్‌గా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
బాలకృష్ణ విలన్‌గా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?