AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరో అంతర్జాతీయ టోర్నీని నిర్వహిస్తోంది. ఐసీసీ నిర్వహిస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్-2026 ఈవెంట్ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఇంగ్లాండ్, వేల్స్‌లో జూన్ 12 నుంచి జూలై 5, 2026 వరకు ఈ క్రికెట్ ఈవెంట్ జరగనుంది. ఇది మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో 10వ ఎడిషన్. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తుండగా.. 2009లో తొలి టోర్నీకి కూడా ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం విశేషం. ఈ టోర్నీలో ఈసారి మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. తొలిసారి నెథర్లాండ్ జట్టు కూడా మహిళల టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకుంది. టోర్నీలో 33 మ్యాచ్‌లు నిర్వహించనుండగా, లార్డ్స్, ఎడ్జ్‌బాస్టన్, ఓల్డ్ ట్రాఫోర్డ్, హెడింగ్లీ వంటి ప్రముఖ వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ జట్టు తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లు కూడా పోటీలో నిలుస్తున్నాయి. జూలై 5న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు ఈ టోర్నీ మరో నిదర్శనంగా నిలవనుంది.

ఇంకా చదవండి

ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌’లో మన తెలుగమ్మాయి.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో శ్రీచరణి భారీ రికార్డ్..!

భారత మహిళల క్రికెట్‌లో సరికొత్త ఆశాకిరణంగా ఎదిగిన శ్రీచరణి సాధించిన ఈ విజయం ఎంతోమంది యువ క్రీడాకారిణులకు స్పూర్తిదాయకం. ఐసీసీ ప్రపంచ అత్యుత్తమ జట్టులో స్థానం సంపాదించడం ఆమె ప్రతిభకు దక్కిన గౌరవం. రాబోయే రోజుల్లో శ్రీచరణి మరిన్ని రికార్డులను బద్దలు కొడుతూ, భారత జట్టుకు మరిన్ని చిరస్మరణీయ విజయాలను అందించాలని ఆశిద్దాం.

Womens T20 World Cup : సొంతగడ్డపై ఇంగ్లాండ్ అజేయ రికార్డ్.. ఆతిథ్య దేశానికే కలిసొచ్చే సెంటిమెంట్

Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో లార్డ్స్ వేదికగా అజేయ జట్లైన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. సొంతగడ్డపై ఇంగ్లాండ్ అజేయ రికార్డు, ఆస్ట్రేలియా ఏడో టైటిల్ లక్ష్యం, రూ.22 కోట్ల ప్రైజ్ మనీ ఈ మెగా ఫైనల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

  • Rakesh
  • Updated on: Jul 5, 2026
  • 3:07 pm

T20 World Cup 2026 Final: ఓటమే ఎరుగని రెండు జట్లు ఢీ కొడితే ఎలా ఉంటదో తెలుసా.. తొలిసారి ఇలాంటి మ్యాచ్..!

AUS W vs ENG W Head to Head: క్రికెట్ మక్కాగా పిలవబడే లార్డ్స్ మైదానంలో ఈ ఇరు జట్ల మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయం. ఆస్ట్రేలియాకు మెగా టోర్నీల ఫైనల్స్ ఆడిన అనుభవం అండగా ఉంటే, ఇంగ్లాండ్ జట్టుకు సొంత ప్రేక్షకుల మద్దతు కొండంత బలాన్ని ఇస్తోంది. ప్రపంచకప్ ట్రోఫీ ఏ జట్టును వరిస్తుందో చూడాలి.

మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ విజేతపై కాసుల వర్షం.. భారత జట్టుకు దక్కేది ఎంతంటే..?

Women's T20 World Cup 2026 Prize Money: 2026 మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ జూలై 5న లార్డ్స్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనుంది. ఐసీసీ ఈ ఏడాది ప్రైజ్ మనీని రూ. 82 కోట్లకు పెంచింది. విజేతకు రూ. 22 కోట్లు, రన్నరప్‌కు రూ. 11 కోట్లు లభిస్తాయి. సెమీ-ఫైనలిస్టులకు ఒక్కొక్కరికి రూ. 6.29 కోట్లు, గ్రూప్ దశ విజేతలకు ఒక్కొక్కరికి రూ. 29 లక్షలు లభిస్తాయి.

Womens T20 World Cup : లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ ఫైట్.. గెలిచిన జట్టుకు ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే ?

Womens T20 World Cup : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. విజేతకు రూ.22 కోట్లకు పైగా ప్రైజ్ మనీ, రన్నరప్‌కు రూ.11 కోట్ల భారీ నగదు బహుమతి లభించనుంది.

  • Rakesh
  • Updated on: Jul 3, 2026
  • 11:58 am

Shabnim Ismail : రిటైర్మెంట్ ప్రకటించిన 3 ఏళ్ల తర్వాత అదిరిపోయే రీ-ఎంట్రీ.. వరల్డ్ కప్ సెమీఫైనల్లో సౌతాఫ్రికా పేసర్ వీరవిహారం

Shabnim Ismail : మూడేళ్ల రిటైర్మెంట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన శబ్నిమ్ ఇస్మాయిల్ మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను కుదిపేసింది. ఈ మ్యాచ్‌తో వరల్డ్ కప్ చరిత్రలో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది.

  • Rakesh
  • Updated on: Jul 3, 2026
  • 8:04 am

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒలింపిక్స్ బరిలో 6 జట్లు.. టీమిండియాతోపాటు 4 టీంలు క్వాలిఫై.. మరో రెండు ఏవంటే?

ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ చేరడం అనేది క్రీడా ప్రపంచంలోనే ఒక మైలురాయి. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఆదరించే ఈ ఆటను ఒలింపిక్స్‌లో చూడటం అభిమానులకు కనువిందు చేయడమే కాకుండా, కొత్త దేశాల్లో ఈ క్రీడ విస్తరించడానికి ఎంతగానో దోహదపడుతుంది. మన భారత జట్లు ఒలింపిక్ పతకాలతో తిరిగి రావాలని ఆశిద్దాం.

హర్మన్‌ప్రీత్ సంచలనం.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 4 రికార్డులు బ్రేక్ చేసిన లేడీ రోహిత్..!

Harmanpreet Kaur fastest fifty: ఒత్తిడితో కూడిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు కనబరిచిన పోరాట పటిమ అద్వితీయం. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ భారత జట్టులో కొత్త ఉత్తేజాన్ని నింపింది. ఈ రికార్డుల విజయం రాబోయే సెమీఫైనల్ పోరుకు భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మహిళల టీ20 క్రికెట్‌లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ సరికొత్త చరిత్ర.. ఆస్ట్రేలియాపై ప్రపంచ రికార్డు!

సంచలన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా జట్టును దీటుగా ఎదుర్కొంటూ స్మృతి మంధాన, షెఫాలీ వర్మ నెలకొల్పిన ఈ ప్రపంచ రికార్డు భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఒత్తిడిని జయించి ఈ ఇద్దరు అందించిన శుభారంభం, ఈ ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టును విజయతీరాలకు చేర్చి సెమీఫైనల్ బెర్తును ఖరారు చేస్తుందని యావత్ దేశం ఆశిస్తోంది.

AUSW vs INDW Women’s T20 WC Highlights: ఓడిన భారత్.. సెమీస్ చేరిన ఆసీస్

Australia vs India, Women’s T20 World Cup 2026 Highlights Updates: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత మహిళల జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పటిష్టమైన ఆస్ట్రేలియాతో జరిగిన 30వ లీగ్ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కంగారూలు మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించి, 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు.

Smriti Mandhana : గ్యాప్ తగ్గింది, గెలుపు మాదే!.. స్మృతి మంధాన కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా

Smriti Mandhana : టీ20 మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తో కీలక పోరుకు ముందు స్మృతి మంధాన ధీమా వ్యక్తం చేశారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య గతంతో పోలిస్తే గ్యాప్ బాగా తగ్గిందని, WPL అనుభవం జట్టుకు ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

  • Rakesh
  • Updated on: Jun 28, 2026
  • 9:52 am

Womens T20 World Cup 2026 : రెండ్రోజులైనా కాలేదు.. మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు

Womens T20 World Cup 2026 : టీ20 మహిళల ప్రపంచకప్ 2026లో ఐర్లాండ్ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఓర్లా ప్రెండర్గాస్ట్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఐర్లాండ్ క్రికెట్‌లో మరో మైలురాయి చేరుకుంది.

  • Rakesh
  • Updated on: Jun 28, 2026
  • 8:04 am