AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens T20 World Cup : లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ ఫైట్.. గెలిచిన జట్టుకు ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే ?

Womens T20 World Cup : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. విజేతకు రూ.22 కోట్లకు పైగా ప్రైజ్ మనీ, రన్నరప్‌కు రూ.11 కోట్ల భారీ నగదు బహుమతి లభించనుంది.

Womens T20 World Cup : లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ ఫైట్.. గెలిచిన జట్టుకు   ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే ?
Womens T20 World Cup
Rakesh
|

Updated on: Jul 03, 2026 | 11:58 AM

Share

Womens T20 World Cup : ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఓటమనేదే ఎరుగకుండా అజేయంగా దూసుకొచ్చిన రెండు అత్యంత బలమైన జట్లు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలు ఇప్పుడు టైటిల్ పోరులో తలపడటానికి సిద్ధమయ్యాయి. మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు వెస్టిండీస్‌ను ఓడించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక రెండో సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి ఇంగ్లాండ్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. క్రికెట్ మక్కాగా పిలిచే చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జులై 5వ తేదీన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి ఐసీసీ ప్రైజ్ మనీని భారీగా పెంచడంతో ఫైనల్ చేరిన రెండు జట్లపై కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.

మహిళా క్రికెట్‌కు ఐసీసీ భారీ నజరానా

ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ ఏడాది ప్రైజ్ పూల్‌ను రికార్డు స్థాయిలో పెంచింది. ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి మెరిసే ట్రోఫీని అందుకునే జట్టుకు ఏకంగా 2.34 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.22 కోట్లకు పైగా) బహుమతిగా లభించనుంది. కేవలం గెలిచిన జట్టుకే కాకుండా, రన్నరప్‌గా నిలిచే జట్టుకు కూడా ఐసీసీ భారీ మొత్తాన్ని ఇస్తోంది. రన్నరప్ జట్టుకు 1.17 మిలియన్ డాలర్లు (సుమారు రూ.11 కోట్లు) నగదు పురస్కారం అందుతుంది. దీనివల్ల ఈసారి లార్డ్స్ బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు భారీగా లాభపడనున్నారు.

జులై 5న అసలైన సమరం

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫైనల్ మ్యాచ్ జులై 5వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది. అంతకంటే అరగంట ముందు, అంటే రాత్రి 7:30 గంటలకే ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం మైదానంలోకి అడుగుపెడతారు. ప్రస్తుత ఫామ్ ఆధారంగా చూస్తే రెండు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తుండటంతో లార్డ్స్ వేదికగా ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగడం ఖాయం. రికార్డుల పరంగా చూస్తే, ఆస్ట్రేలియా మహిళల జట్టు రికార్డు స్థాయిలో 8వ సారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడుతుండగా, ఇంగ్లాండ్ జట్టుకు ఇది 5వ ఫైనల్ మ్యాచ్ కావడం విశేషం.

ఇరు జట్ల పూర్తి స్క్వాడ్స్

ఇంగ్లాండ్ మహిళల జట్టు :

నెట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), డానియల్ గిబ్సన్, అమీ జోన్స్, లారెన్ బెల్, ఆలిస్ క్యాప్సే, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టన్, లారెన్ ఫైలర్, ఫ్రెయా కెంప్, హీథర్ నైట్, లిన్సే స్మిత్, ఇస్సీ వాంగ్, డ్యానీ వ్యాట్-హాడ్జ్.

ఆస్ట్రేలియా మహిళల జట్టు :

సోఫీ మోలిన్యూక్స్ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్, యాష్లే గార్డనర్, జార్జియా వేర్‌హామ్, జార్జియా వోల్, అన్నాబెల్ సదర్‌లాండ్, మేగాన్ షుట్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలానా కింగ్, గ్రేస్ హారిస్, లూసీ హామిల్టన్, కిమ్ గార్త్, నికోలా కేరీ.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ ఫైట్
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ ఫైట్
ఆ సినిమా రిలీజ్ చేసి పెద్ద తప్పు చేశా..
ఆ సినిమా రిలీజ్ చేసి పెద్ద తప్పు చేశా..
పుంగనూరు జాతి ఆవులు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
పుంగనూరు జాతి ఆవులు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
తల్లిదండ్రులు చేసే ఈ చిన్న పొరపాటుతో పిల్లల ప్రాణాలకే ముప్పు..
తల్లిదండ్రులు చేసే ఈ చిన్న పొరపాటుతో పిల్లల ప్రాణాలకే ముప్పు..
టోల్ ప్లాజా వద్ద కళ్ల ముందే కాలిపోయిన గ్యాస్ ట్యాంకర్!
టోల్ ప్లాజా వద్ద కళ్ల ముందే కాలిపోయిన గ్యాస్ ట్యాంకర్!
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి
వందేళ్ల వరద వచ్చినా నో టెన్షన్..! మూసీ నదిపై భారీ ప్లాన్!
వందేళ్ల వరద వచ్చినా నో టెన్షన్..! మూసీ నదిపై భారీ ప్లాన్!
పాము పిల్ల గురించి ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
పాము పిల్ల గురించి ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ఊహించని ట్విస్టులు.. మైండ్ బ్లాంక్ అయ్యే సస్పెన్స్.
ఊహించని ట్విస్టులు.. మైండ్ బ్లాంక్ అయ్యే సస్పెన్స్.
ఉద్యోగం పోతే ఎలా? నో టెన్షన్‌.. కుటుంబ ఖర్చుల కోసం 4 పనులు చేయండి
ఉద్యోగం పోతే ఎలా? నో టెన్షన్‌.. కుటుంబ ఖర్చుల కోసం 4 పనులు చేయండి