క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒలింపిక్స్ బరిలో 6 జట్లు.. టీమిండియాతోపాటు 4 టీంలు క్వాలిఫై.. మరో రెండు ఏవంటే?
ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ చేరడం అనేది క్రీడా ప్రపంచంలోనే ఒక మైలురాయి. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఆదరించే ఈ ఆటను ఒలింపిక్స్‌లో చూడటం అభిమానులకు కనువిందు చేయడమే కాకుండా, కొత్త దేశాల్లో ఈ క్రీడ విస్తరించడానికి ఎంతగానో దోహదపడుతుంది. మన భారత జట్లు ఒలింపిక్ పతకాలతో తిరిగి రావాలని ఆశిద్దాం.

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కీలక ప్రకటన చేశాయి. మెగా టోర్నీలో పాల్గొనే జట్ల అర్హత మార్గాలను అధికారికంగా ఖరారు చేస్తూ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి.
లాస్ ఏంజిల్స్ వేదికగా చారిత్రాత్మక సమరం..
దాదాపు శతాబ్దం తర్వాత ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ సందడి చేయబోతోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో టీ20 ఫార్మాట్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. పొమోనాలోని అత్యాధునిక క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. రెండు విభాగాల్లోనూ కేవలం ఆరేసి జట్లు మాత్రమే తలపడనున్నాయి. దీంతో ఒలింపిక్ పతకం కోసం ప్రపంచ అత్యుత్తమ జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
తొలి నాలుగు స్థానాల్లో భారత్, ఆస్ట్రేలియా..
View this post on Instagram
మహిళల విభాగంలో అర్హత రేసు ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ప్రదర్శన ఆధారంగా తొలి నాలుగు జట్లను ఖరారు చేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఓషియానియా ఖండాల నుంచి అత్యుత్తమ స్థానాల్లో నిలిచిన భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, గ్రేట్ బ్రిటన్ (ఇంగ్లాండ్) జట్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. భారత మహిళల జట్టు ఒలింపిక్ బరిలో నిలవనుండటం దేశీయ క్రికెట్ అభిమానులకు తీపి కబురనే చెప్పాలి.
పురుషుల జట్ల ఎంపిక ఇలా..
పురుషుల విభాగంలో జట్ల ఎంపిక పూర్తిగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా జరుగుతుంది. 2026 డిసెంబర్ 31 నాటికి ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఓషియానియా ఖండాల నుంచి టాప్-15 ర్యాంకుల్లో ఉన్న అత్యుత్తమ జట్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశంగా ఉన్న అమెరికా (యూఎస్ఏ) పురుషుల, మహిళల జట్లు కూడా ఒలింపిక్స్‌లో ఆడాలంటే 2026 డిసెంబర్ కటాఫ్ నాటికి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి 15 స్థానాల్లో నిలవడం తప్పనిసరి.
వెస్టిండీస్ జట్టుకు ప్రత్యేక రూల్స్..
ఒలింపిక్స్‌లో కరేబియన్ దేశాలు విడివిడిగా పాల్గొంటాయి. కానీ క్రికెట్‌లో వెస్టిండీస్ ఒకే జట్టుగా ఆడుతుంది. వెస్టిండీస్‌కు ప్రత్యేకంగా ఒలింపిక్ కమిటీ గుర్తింపు లేనందున, వారు నేరుగా పాల్గొనే అవకాశం లేదు. ఒకవేళ వెస్టిండీస్ జట్టు టాప్ ర్యాంకుల్లో ఉంటే, ఆ ప్రాంతంలోని దేశాల కోసం ఐసీసీ ప్రత్యేకంగా ఒక ‘కరేబియన్ క్వాలిఫైయర్’ టోర్నీ నిర్వహిస్తుంది. అందులో గెలిచిన దేశం ఒలింపిక్ అర్హత పోటీల్లో పాల్గొంటుంది.
ఇది కూడా చదవండి: టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. పోతూపోతూ ప్రపంచ రికార్డుతో గర్జించిన పాక్ ప్లేయర్..!
సరికొత్త ఒలింపిక్ క్వాలిఫైయర్ టోర్నీ..
View this post on Instagram
ఐదు స్థానాలు ర్యాంకింగ్స్, ప్రపంచకప్ ఆధారంగా భర్తీ అయిన తర్వాత, ఆరో, చివరి స్థానం కోసం ఐసీసీ 2027లో సరికొత్తగా ‘ఐసీసీ ఒలింపిక్స్ క్వాలిఫైయర్’ టోర్నీని ప్రవేశపెట్టబోతోంది. ఇందులో పురుషుల, మహిళల విభాగాల నుంచి ఎనిమిది జట్లు తలపడతాయి. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు ఒలింపిక్స్‌లో ఆడే చివరి అవకాశం దక్కుతుంది. ఒలింపిక్స్ ప్రధాన టోర్నీలో జట్లను మూడు చొప్పున రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. టాప్-2 లో నిలిచిన జట్లు స్వర్ణం, రజతం కోసం, మూడు నాలుగు స్థానాల్లోని జట్లు కాంస్య పతకం కోసం పోరాడతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
