AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE: ఆ ఇద్దరే టీమిండియాకు పట్టిన దరిద్రం.. అర్జెంటుగా పీకేయండి.. లేదంటే 2వ మ్యాచ్ కూడా..!

Sunil Gavaskar Fire on Team India: ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపై భారత జట్టు ఒత్తిడిని తట్టుకోలేక ఒరిగిపోవడం నిజంగా ఆందోళనకరమైన విషయమే. కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యూహాలు ఫలించకపోవడం, సీనియర్ ఆటగాళ్లు బాధ్యత మరవడం జట్టు కొంపముంచింది. తదుపరి మ్యాచ్‌ల్లో అయినా లోపాలను సరిదిద్దుకుని, టీమిండియా బలంగా పునరాగమనం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

IND vs IRE: ఆ ఇద్దరే టీమిండియాకు పట్టిన దరిద్రం.. అర్జెంటుగా పీకేయండి.. లేదంటే 2వ మ్యాచ్ కూడా..!
Sunil Gavaskar Fire On Team India
Venkata Chari
|

Updated on: Jun 27, 2026 | 5:32 PM

Share

India vs Ireland 1st T20I: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ భారత్ ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ అవమానకర ఓటమిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మన బౌలర్ల పేలవ ప్రదర్శన, బాధ్యతారహితమైన బ్యాటింగే పసికూన చేతిలో టీమిండియా తలవంచడానికి ప్రధాన కారణమంటూ ఆయన పదునైన విమర్శలు గుప్పించారు.

ప్రపంచ ఛాంపియన్ల అసలు రంగు బయటపడింది!

టీ20 ప్రపంచకప్ గెలిచిన గర్వంతో బరిలోకి దిగిన భారత యువ జట్టుకు ఐర్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 148 పరుగులకే చేతులెత్తేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లంతా క్రీజులోకి రావడం, వెళ్లడమే పనిగా పెట్టుకున్నారు. కొత్తగా టీ20 కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్‌కు తొలి మ్యాచ్‌లోనే ఈ ఘోర ఓటమి ఎదురవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఇది కూడా చదవండి: IND vs IRE: ఐర్లాండ్ చేతిలో ఇప్పటి వరకు ఓడిపోని ‘3 టీంలు’.. లిస్ట్‌లో 2వ పేరు షాకింగ్ భయ్యో..!

ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ చేజారింది.. పరుగుల వరద పారించారు..!

ఈ ఘోర పరాజయానికి ముఖ్యంగా ఇద్దరు ఆటగాళ్ల బౌలింగ్ వైఫల్యమే కారణమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, విశ్లేషకులు దుమ్మెత్తిపోస్తున్నారు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కలిసి ఐర్లాండ్ బ్యాటర్లకు పరుగుల పండగ చేసుకునే అవకాశం కల్పించారు. ఐర్లాండ్ చేసిన మొత్తం స్కోరులో దాదాపు సగం పరుగులు (76 పరుగులు) ఈ ఇద్దరి బౌలింగ్‌లోనే రావడం గమనార్హం.

తన కోటా 4 ఓవర్లు వేసిన ప్రసిద్ధ్ కృష్ణ ఏకంగా 57 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కేవలం ఒకే ఒక్క ఓవర్ వేసి ఏకంగా 19 పరుగులు ఇచ్చుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ పూర్తిగా విఫలమైన సుందర్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌.. ఆ చెత్త లిస్ట్‌లో నంబర్ 1గా శ్రేయాస్.. నెక్ట్స్ పేరు చూస్తే ఫ్యాన్స్ హర్ట్ అవ్వాల్సిందే?

అభిమానుల ఆవేదన.. వైభవ్ సూర్యవంశీ ఉంటే బాగుండేదా?

పసికూన చేతిలో టీమిండియా దారుణంగా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై మ్యాచ్ అనంతరం సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో స్పందించారు. “వైభవ్ సూర్యవంశీ లేకపోతే భారత్ ప్రపంచకప్ గెలవలేదా?” అంటూ ప్రశ్నించిన గవాస్కర్, కేవలం ఒక ఆటగాడి చుట్టూ కథ అల్లడం సరికాదన్నారు. మధ్య ఓవర్లలో భారత బౌలర్లు పూర్తిగా లయ తప్పడమే ఈ ఘోర పరాజయానికి అసలు కారణమని ఆయన విశ్లేషించారు.

మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us