AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌’లో మన తెలుగమ్మాయి.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో శ్రీచరణి భారీ రికార్డ్..!

భారత మహిళల క్రికెట్‌లో సరికొత్త ఆశాకిరణంగా ఎదిగిన శ్రీచరణి సాధించిన ఈ విజయం ఎంతోమంది యువ క్రీడాకారిణులకు స్పూర్తిదాయకం. ఐసీసీ ప్రపంచ అత్యుత్తమ జట్టులో స్థానం సంపాదించడం ఆమె ప్రతిభకు దక్కిన గౌరవం. రాబోయే రోజుల్లో శ్రీచరణి మరిన్ని రికార్డులను బద్దలు కొడుతూ, భారత జట్టుకు మరిన్ని చిరస్మరణీయ విజయాలను అందించాలని ఆశిద్దాం.

ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌’లో మన తెలుగమ్మాయి.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో శ్రీచరణి భారీ రికార్డ్..!
Sricharani Bowling Stats T20 World Cup
Venkata Chari
|

Updated on: Jul 07, 2026 | 1:56 PM

Share

మహిళల టీ20 ప్రపంచకప్-2026 ముగిసినా, భారత క్రికెట్ అభిమానుల్లో ఆ జోష్ ఇంకా తగ్గలేదు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’లో భారత్ నుంచి ఒకే ఒక్క క్రీడాకారిణి చోటు దక్కించుకుని దేశం గర్వించేలా చేసింది. ఆ మెరుపుల వెనుక ఉన్న మన తెలుగు మూలాల యువ స్పిన్నర్ శ్రీచరణి అద్భుత ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం..

విశ్వవిజేతలపై ఆసీస్ ఆధిపత్యం.. భారత్ తరఫున శ్రీచరణి ఒంటరి పోరాటం

ఇటీవలే జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఆస్ట్రేలియా మహిళల జట్టు ఏడోసారి ప్రపంచకప్ ముద్దాడిన సంగతి తెలిసిందే. సోమవారం ఐసీసీ ప్రకటించిన ఉత్తమ జట్టులోనూ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఐదు స్థానాలను కైవసం చేసుకుని తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో 238 పరుగులు చేసిన ఆసీస్ వికెట్ కీపర్ బెత్ మూనీ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డుతో పాటు ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, ఇంతటి కఠినమైన పోటీలోనూ భారత జట్టు తరపున ఏకైక ప్రతినిధిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది యువ సంచలనం శ్రీచరణి.

ఇది కూడా చదవండి: IND vs ENG: అగ్నిపరీక్షకు సిద్ధమైన కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. 3వ టీ20లో ఆ స్టార్ ప్లేయర్‌పై వేటు?

ఇవి కూడా చదవండి

కేవలం 5 మ్యాచ్‌ల్లోనే విధ్వంసం.. చరిత్ర సృష్టించిన స్పిన్ మాయాజాలం

ఈ మెగా టోర్నమెంట్‌లో శ్రీచరణి చేసిన స్పిన్ విన్యాసాలు అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచాయి. కేవలం 5 మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చినప్పటికీ, ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో వణుకు పుట్టించింది. కేవలం 8.35 అద్భుతమైన సగటుతో ఏకంగా 14 వికెట్లు పడగొట్టి టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకే ఒక మహిళల టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో ఈ స్థాయి వికెట్ల వేట సాగించిన తొలి భారతీయ బౌలర్‌గా శ్రీచరణి చరిత్ర పుటల్లోకెక్కింది. పిచ్‌పై ఆమె బంతిని తిప్పిన తీరు, వికెట్ల వెనుక ఉన్న వ్యూహాలు భారత జట్టుకు కొండంత అండగా నిలిచాయి.

ఇది కూడా చదవండి: Team India: అయ్యర్‌కు డేంజర్ బెల్.. 3 ఛాన్స్‌ల్లో ఒకటి ఫెయిల్.. కొత్త కెప్టెన్ రెడీ చేసిన బీసీసీఐ..?

బ్యాటింగ్‌లో డాని వ్యాట్ హవా.. బౌలింగ్‌లో శ్రీచరణి జోరు

ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఓపెనర్ డాని వ్యాట్-హాడ్జ్ 302 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి బ్యాటింగ్‌లో తన ముద్ర వేయగా, బౌలింగ్ విభాగంలో మాత్రం మన శ్రీచరణిని మించిన వారు లేరని ఐసీసీ అధికారికంగా స్పష్టం చేసింది. సీనియర్ ఆటగాళ్లు సైతం ఒత్తిడికి లోనయ్యే ప్రపంచకప్ లాంటి వేదికపై, ఏమాత్రం బెరుకు లేకుండా వికెట్లు తీస్తూ జట్టును ముందుండి నడిపించిన తీరు నిజంగా ప్రశంసనీయం. ఈ ఘనతతో అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీచరణి పేరు మారుమోగిపోతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us