AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 3rd T20I: 3వ టీ20లో ఐదు మార్పులు.. గౌతమ్ గంభీర్ షాకింగ్ డెసిషన్..?

India Playing XI Changes: వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియాకు ఈ మూడో టీ20 మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ, కేవలం ప్రతిభ మరియు ఫామ్ ఉన్న ఆటగాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ఈ మార్పులు భారత్‌కు విజయాన్ని అందిస్తాయో లేదో వేచి చూడాలి.

IND vs ENG 3rd T20I: 3వ టీ20లో ఐదు మార్పులు.. గౌతమ్ గంభీర్ షాకింగ్ డెసిషన్..?
Ind Vs Eng 3rd T20i Playing Xi
Venkata Chari
|

Updated on: Jul 05, 2026 | 4:20 PM

Share

India Playing XI Changes For 3rd T20I vs England: ఇంగ్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు వరుస పరాజయాలు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కఠిన నిర్ణయాలకు సిద్ధమయ్యారు. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే జూలై 7న నాటింగ్‌హామ్‌లో జరగబోయే మూడో టీ20లో గెలుపు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చేసేందుకు గంభీర్ వ్యూహాలు రచిస్తున్నారు. వరుసగా విఫలమవుతున్న ఐదుగురు ఆటగాళ్లను తుది జట్టు (India Playing XI) నుంచి తప్పించి, వారికి కేవలం డ్రింక్స్ అందించే బాధ్యతలను మాత్రమే పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది.

వైఫల్యాల బాటలో స్పిన్నర్ రవి బిష్ణోయ్..

భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఇటీవలి కాలంలో పరుగులను నియంత్రించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ప్రత్యర్థి బ్యాటర్లు ఆయన బౌలింగ్‌ను చీల్చిచెండాడారు. నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నారు. ఈ పేలవ ప్రదర్శన కారణంగా మూడో మ్యాచ్‌లో ఆయనపై వేటు పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Video: విజయం ముంగిట భారత్.. కట్‌చేస్తే.. టీమిండియా కొంపముంచిన ఆ రెండు ఓవర్లు..!

ఇవి కూడా చదవండి

ఫామ్ కోల్పోయిన ఇషాన్ కిషన్..

ఒకప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఇషాన్ కిషన్, ప్రస్తుతం క్రీజులో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో నిరాశపరిచిన ఆయన, ఇంగ్లాండ్‌పై మొదటి మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. రెండో మ్యాచ్‌లో 49 పరుగులు చేసినప్పటికీ, అందుకోసం 40 బంతులు ఆడటం టీ20 ఫార్మాట్‌కు ఏమాత్రం సరిపోదని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఆయన స్థానంలో వేరే ఆటగాడికి అవకాశం దక్కవచ్చు.

బెంచ్‌కే పరిమితం కానున్న వాషింగ్టన్ సుందర్..

ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు గత కొన్ని మ్యాచ్‌లుగా తుది జట్టులో స్థానం దక్కడం లేదు. ఐర్లాండ్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ తర్వాత ఆయనను పక్కన పెట్టారు. ప్రస్తుత జట్టు సమీకరణాలు, గంభీర్ వ్యూహాల ప్రకారం, మూడో టీ20లోనూ సుందర్ బెంచ్‌కే పరిమితం కాక తప్పేలా లేదు.

సూర్యాంశ్ శెడ్గేపై వేటు?

నితీష్ కుమార్ రెడ్డి గాయపడటంతో జట్టులోకి వచ్చిన సూర్యాంశ్ శెడ్గే తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఐర్లాండ్‌పై ఆడిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఒక పరుగు మాత్రమే చేసి, బౌలింగ్‌లో వికెట్ లేకుండా 25 పరుగులు ఇచ్చారు. నాటింగ్‌హామ్ మ్యాచ్‌లో జట్టు మేనేజ్‌మెంట్ అనుభవజ్ఞుడైన శివం దూబే వైపు మొగ్గు చూపే అవకాశం ఉండటంతో శెడ్గేకు స్థానం దక్కడం కష్టమే.

ఇది కూడా చదవండి: వాడిని క్షమించను.. నమ్మి 7 నెలల తర్వాత ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు..

పేలవ ప్రదర్శనతో ప్రసిద్ధ్ కృష్ణ అవుట్..

వేగవంతమైన బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా లయను అందుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఐర్లాండ్ పర్యటనలో ఒకే మ్యాచ్‌లో 57 పరుగులు సమర్పించుకుని వికెట్లేమీ సాధించలేకపోయాడు. దీంతో ఆయనను జట్టు నుండి తక్షణమే పక్కన పెట్టారు. భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తే, ప్రసిద్ధ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us