AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం సినిమారా బాబు..! సీన్ సీన్‌కు సస్పెన్స్… క్లైమాక్స్ ట్విస్ట్‌కు నరాలు తెగిపోవాల్సిందే..!!

ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా మరీ ఈ జానర్ చిత్రాలను చూస్తున్నారు ఆడియెన్స్. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఈ రకమైన సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇక ఇతర భాషల్లోని సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులోకి డబ్ అయ్యి స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఏం సినిమారా బాబు..! సీన్ సీన్‌కు సస్పెన్స్... క్లైమాక్స్ ట్విస్ట్‌కు నరాలు తెగిపోవాల్సిందే..!!
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jun 15, 2026 | 11:42 AM

Share

థియేటర్స్ లో ప్రస్తుతం పెద్ది సినిమా దుమ్మురేపుతోంది. ఈ సమ్మర్ లో పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. దాంతో ఆడియన్స్ అందరూ మంచి ఆకలి మీద ఉన్నారు. ఆ ఆకలిని పెద్ది సినిమా తీర్చేసింది. బుచ్చిబాబు బాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. పెద్ది సినిమా ఇప్పటికే 393 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది పెద్ది. ఇక థియేటర్స్ లో పెద్ది సినిమా రాణిస్తుండగా ఓటీటీలోనూ కొన్ని సినిమాలు పేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో సినిమాలు ఆడియన్స్ ను డబుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆడియన్స్ ను ఈ సినిమా కట్టిపడేస్తుంది. బాబోయ్ ఒకొక్క సీన్ కు నరాలు తెగిపోవాల్సిందే..

ఇది కూడా చదవండి : కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా

తెలుగులో మలయాళం సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్ అయిన మలయాళం సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో దృఢం మూవీ ఒకటి. ఈ సినిమా కథ విషయానికొస్తే .. సబ్ ఇన్‌స్పెక్టర్ విజయ్ (షేన్ నిగమ్)కు కేరళలోని ‘కుళినిలం’ అనే ఒక  హిల్ స్టేషన్ లో మొదటి పోస్టింగ్ పడుతుంది. అయితే అక్కడ పెద్దగా క్రైమ్స్ జరగవు. దాంతో పెద్దగా టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా జాబ్ చెయ్యొచ్చు అని విజయ్ అనుకుంటాడు. అయితే కొద్దీ రోజుల తర్వాత ఆ ఊర్లో ఓ కుళ్లిపోయిన శవం కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి : ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది

ఆ వెంటనే అక్కడ ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం జరుగుతుంది. దాంతో పోలీసులు ఈ దొంగతనం పై విచారణ చేస్తుంటే మరో శవం బయటపడుతుంది. దాంతో అసలు కథ మొదలవుతుంది. ఈ క్రైమ్స్ అన్నింటికీ ఏదైనా లింక్ ఉందా అన్నది తెలుసుకునే పనిలో పడతారు పోలీసులు. పోలీసుల మీద ప్రజర్ కూడా పెరుగుతుంది. దాంతో ఆ పోలీస్ ఆఫర్స్ కేసును ఛేదించాడా.? అతను ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడు.? అసలు ఆ శవాలు ఎవరివి.? అనేది సినిమాలో చూడాల్సిందే. సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఇటీవలే ఈ సినిమా జియోహాట్‌స్టార్ లోకి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ డాన్స్ ఏంటి అమ్మడు..! హ్యాపీ రీ రిలీజ్‌లో రచ్చ చేసిన హీరోయిన్.. థియేటర్ దద్దరిల్లిందిగా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీళ్లే
టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీళ్లే