AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: ట్రంప్ ప్రకటనతో కొత్త జోష్.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు.

అమెరికా-ఇరాన్ మధ్య యుద్దానికి ఎండ్ కార్డ్ పడింది. ఈ నెలలో ఈ రెండు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. దీంతో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. తక్షణమే హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ ప్రకటన క్రమంలో దేశీయ సూచీలు జోష్‌లో ఉన్నాయి.

Stock Market: ట్రంప్ ప్రకటనతో కొత్త జోష్.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు.
Stock Market
Venkatrao Lella
|

Updated on: Jun 15, 2026 | 11:55 AM

Share

భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. యుద్దం ముగింపుపై అమెరికా-ఇరాన్ మధ్య ప్రాధమిక ఒప్పందం కుదిరిందని, హర్ముజ్ జలసంధి వెంటనే తెరుచుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపునిచ్చింది. ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పడిపోవడంతో మార్కెట్లలో సానుకూల ధోరణి ఏర్పడింది. అమెరికా, ఇరాన్‌లు శుక్రవారం స్విట్జర్లాండ్‌లో ప్రత్యక్షంగా ఒక ఒప్పందాన్ని ఖరారు చేశాయి.  ట్రంప్ ఆదివారం సాయంత్రం ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ శాంతి ఒప్పందంపై జూన్ 19న స్విట్జర్లాండ్‌లో సంతకాలు జరుగుతాయని తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య 107 రోజులుగా యుద్దం జరిగింది. ఈ వార్‌కు ఫుల్ స్టాఫ్ పెడుతున్నట్లు ట్రంప్ చేసిన ప్రకనటతో దేశీయ మార్కెట్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ట్రంప్ ప్రకటనతో కొత్త జోష్

ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 1270.75 పాయింట్లు పెరిగి 76,798.70 వద్ద ట్రేడవుతోండగా.. నిఫ్టీ 383.05 పాయింట్లు లాభపడి 24,005.95 వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 1.62 శాతం పెరగ్గా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు 1.43 శాతం పుంజుకున్నాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2 శాతం పుంజుకుంది. ఇక ఆర్బీఐ ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ స్కీమ్ రుణదాతకు ఒక ప్రధాన సానుకూల అంశం అవుతుందని నోమురా పేర్కొంది. అలాగే దీర్ఘకాలంలో విదేశీ కరెన్సీ డిపాజిట్లను ఆకర్షించేందుకు, ద్రవ్యతను మెరుగుపర్చేందుకు మార్జిన్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు ఇది సహాయపడే అవకాశముంది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు పెరిగాయి. ఇక పశ్చిమాసియా నుంచి ఆదాయం పొందుతున్న లారెన్స్ అండ్ టూబ్రో షేర్లు 3.2 శాతం పుంజుకుంది. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఆయిల్ మార్కెట్ కంపెనీలు, టైర్ తయారీదారులు, పెయింట్, విమానయాన సంస్ధ షేర్లు పెరిగాయి. ఇక అమెరికాతో పోలిస్తే రూపాయి విలువ కూడా పెరిగింది. ట్రంప్ ప్రకటన తర్వాత వరూపాయి విలువ 58 పైసలు బలపడి 94.60కి చేరుకుంది. అమెరికా డాలర్ బలహీనడటం రూపాయికి ఊతమిచ్చింది.

Follow Us