AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Odyssey: కాంట్రవర్సీలో క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ ట్రైలర్

The Odyssey: కాంట్రవర్సీలో క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ ట్రైలర్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 10, 2026 | 7:51 PM

Share

క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న ‘ది ఒడిస్సీ’ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ట్రైలర్‌కు భారీ స్థాయిలో నెగిటివ్ స్పందన రావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. క్యాస్టింగ్ ఎంపికలు, మోడ్రన్ డైలాగ్స్, గ్రీక్ ఇతిహాసాన్ని మార్చి చూపించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెగిటివ్ బజ్‌ను అధిగమించి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో ఆసక్తిగా మారింది.

క్రిస్టోఫర్ నోలన్.. హాలీవుడ్‌లో ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ దగ్గర ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఈ గ్రేట్‌ డైరెక్టర్ లేటెస్ట్ మూవీ ‘ది ఒడిస్సీ’ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. కానీ ఈసారి పాజిటివ్ బజ్‌తో కాదు, రికార్డ్ స్థాయిలో నెగిటివిటీతో వార్తల్లో నిలిచింది. ఇంతకీ నోలన్ సినిమాపై ఇంత నెగిటివిటీ ఎందుకు వస్తోంది? ఆ ట్రైలర్ కాంట్రవర్సీ ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఫాలో దిస్‌ స్టోరి. ‘ఒపెన్‌హైమర్’ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ నుంచి వస్తున్న భారీ చిత్రం ‘ది ఒడిస్సీ’. హోమర్ రాసిన గ్రీక్ నావెల్‌ ఆధారంగా దాదాపు రెండు వేల 3 వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, ఎనీ హాతవే, జెండయా లాంటి భారీ స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. యూనివర్సల్ పిక్చర్స్ రిలీజ్ చేసిన ‘ది ఒడిస్సీ’ కౌంట్‌డౌన్ ట్రైలర్ మీద విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ఈ ట్రైలర్‌కు ఏకంగా 5 లక్షలకు పైగా డిస్‌లైక్స్ రావడం హాలీవుడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. నోలన్ కెరీర్‌లోనే అత్యధిక డిస్‌లైక్స్ వచ్చిన ట్రైలర్‌గా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. హెలెన్ ఆఫ్ ట్రాయ్ పాత్రలో లుపిటా న్యోంగోను తీసుకోవడం, మ్యాట్ డామన్ డైలాగ్స్ మరీ మోడ్రన్‌గా ఉండటంతో పాటు చారిత్రక సంఘటలను వక్రీకరించారంటూ నోలన్‌ టీమ్‌ మీద ఫ్యాన్స్ ఫైర్‌ అవుతున్నారు. క్యాస్టింగ్ నుంచి మోడ్రన్ ఇంగ్లీష్ యాక్సెంట్ వరకు ప్రతి ఫ్రేమ్‌పైనా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎపిక్ స్టోరీని మోడ్రనైజ్ చేసి ఖూనీ చేశారంటూ కామెంట్స్‌తో నెటిజెన్స్‌ విరుచుకుపడుతున్నారు. పరిస్థితి చేయి దాటడంతో యూనివర్సల్ సంస్థ కామెంట్స్ సెక్షన్‌ను కూడా లాక్ చేసింది. ప్రేక్షకులు అంచనా వేసిన దానికి, ట్రైలర్‌లో చూపించిన దానికి పొంతన లేకపోవడమే నెగిటివిటీకి కారణమన్న టాక్ వినిపిస్తోంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ బజ్‌ను బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ కొడుతుందా లేదా అన్నది చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా

వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్

ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

Follow Us