AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Pin: ఏటీఎం పిన్‌లో కేవలం నాలుగు నెంబర్లు మాత్రమే ఎందుకుంటాయి..? ఓహో.. అసలు సీక్రెట్ ఇదా..

మీరు ఏటీఎం పిన్ నెంబర్ గమనిస్తే కేవలం నాలుగు అంకెలు మాత్రమే కలిగి ఉంటుంది. కేవలం నాలుగు సంఖ్యలు మాత్రమే ఎందుకు ఉంటాయనే అనుమానం చాలామందికి వచ్చి ఉంటుంది. అయితే దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంది. అదేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ATM Pin: ఏటీఎం పిన్‌లో కేవలం నాలుగు నెంబర్లు మాత్రమే ఎందుకుంటాయి..? ఓహో.. అసలు సీక్రెట్ ఇదా..
Atm
Venkatrao Lella
|

Updated on: Jul 10, 2026 | 9:07 PM

Share

బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతీఒక్కరికీ తప్పనిసరిగా ఏటీఎం కార్డు అనేది ఉంటుంది. అత్యవసరంగా నగదు అవసరమైనప్పుడు సమీపంలోని ఏటీఎంలకు వెళ్లి సులువుగా డెబిట్ కార్డ్ ద్వారా విత్ డ్రా చేసుకుంటాం. ఇక బ్యాలెన్స్ చెకింగ్, నిధులు బదిలీ లాంటివి కూడా ఏటీఎం యంత్రాల ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇక నగదు డిపాజిట్ చేసేందుకు ప్రత్యేక క్యాష్ డిపాజిట్ మిషన్లు ఉంటాయి. డెబిట్ కార్డు ఉపయోగించి మన అకౌంట్లో సులువుగా డబ్బులు జమ చేయవచ్చు. అయితే ఏటీఎం కార్డు పిన్ నెంబర్ చూస్తే కేవలం నాలుగు నెంబర్లు మాత్రమే ఉంటుంది. నాలుగు నెంబర్లు మాత్రమే ఉండటానికి రీజన్ ఏంటి? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం.

ఏటీఎం ఎవరు అభివృద్ది చేశారు..?

స్కాట్లాండ్‌కు చెందిన జాన్ షెపర్డ్ బారన్ ప్రపంచంలో తొలిసారిగా ఏటీఎంను అభివృద్ది చేశారు. 1967 జూన్ 27న లండన్‌లోని ఎన్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న బార్‌క్లేస్ బ్యాంక్‌లో తొలి ఏటీఎంను తయారుచేశారు. ఒకరోజుబ్యాంకు మూసి ఉండటంతో ఆయన డబ్బులు తీసుకోలేకపోయారు. ఒకరోజు చాక్లెట్లు అమ్మే ఒక వెండింగ్ మెషీన్‌ను చూశారు. దీంతో అప్పుడు దాని తరహాలోనే పనిచేస్తే ఏటీఎం మెషీన్ ఆలోచన వచ్చింది. ఆ తర్వాత కొన్నిరోజులు కష్టపడి షెపర్డ్ బారన్ ATM మెషీన్ తయారుచేశాడు. ఆ తర్వాత సెక్యూరిటీ కోసం ఓ PIN నెంబర్‌ను క్రియేట్ చేశాడు. షెపర్డ్ బారన్ సంఖ్యలు ఎంత ఎక్కువగా ఉంటే PIN అంత బలంగా ఉంటుందని అనుకున్నాడు. దీనిని గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది గనుక మెసాలు జరగవని భావించాడు.

నాలుగు అంకెల పిన్ నెంబర్ ఎందుకు..?

ఒకరోజు తన భార్య కారోలిన్‌కు షెపర్డ్ బారన్ ఆరు అంకెల పిన్ నెంబర్ చెప్పాడు. కానీ ఆమె గుర్తించుకోలేకపోయింది. కేవలం నాలుగు అంకెలు మాత్రమే గుర్తుంచుకున్న ఆమె.. ఆ తర్వాత రెండు నెంబర్లను చెప్పలేకపోయింది. ఇది గమనించిన ఆయన.. పిన్ నంబర్‌ను 4 అంకెలుగా మార్చాడు. షెపర్డ్ బారన్ తీసుకున్న ఈ నిర్ణయం బ్యాంకింగ్ రంగానికి ఎంతో విలువైనదిగా మారింది.  ప్రపంచవ్యాప్తంగా ఏటీఎం యంత్రాలకు నాలుగు అంకెల పిన్ నెంబర్ ఉపయోగిస్తున్నారు. అయితే నాలుగు అంకెల పిన్ నెంబర్ వల్ల మోసాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ.. గుర్తుంచుకోవడానికి సులభంగా ఉంటుంది. అయితే ఏటీఎంలో మూడుసార్లు తప్పు పిన్ నమోదు చేస్తే ఆటోమేటిక్‌గా కార్డు బ్లాక్ అవుతుంది. అందువల్ల నాలుగు అంకెల పిన్ సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. నాలుగు అంకెల పిన్ నెంబర్ వెనుక ఉన్న అసలు రీజన్ ఇదేనని చెప్పవచ్చు.

Follow Us