Hari Teja: నా ఇమేజ్ డ్యామేజ్ అయింది.. ఇక చస్తే బిగ్‌బాస్‌కి వెళ్లను
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి ముందు మాజీ కంటెస్టెంట్ హరితేజ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. తొలి సీజన్ లోనావాలాలో చిత్రీకరించారని, రాత్రిళ్లు అడవి జంతువుల శబ్దాలు వినిపించేవని ఆమె వెల్లడించారు. సీజన్ 8 తర్వాత తన ఇమేజ్ దెబ్బతిన్నదని, డిప్రెషన్‌కు గురయ్యానని చెబుతూ ఇకపై బిగ్ బాస్‌లో పాల్గొననని స్పష్టం చేశారు.
బుల్లితెరపై టాప్ రేటెడ్ షోగా నామ్ కమాయించిన బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మరి కొన్ని రోజుల్లో షురూ కానుంది. సీజన్ 10 గురించి ఇప్పటికే కింగ్ నాగ్ నుంచి అఫీషియల్ అప్డేట్ తో పాటే ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇప్పటికే సీజన్ 10లోకి వెళ్లే సెలబ్రిటీల లిస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈక్రమంలోనే గతంలో బిగ్ బాస్ పై హరితేజ చేసిన కామెంట్స్ కాస్తా ఇప్పుడు మరో సారి బయటికి వచ్చి హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రముఖ యాంకర్, నటి హరితేజ గతంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పలు సినిమాలు, సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ రెండు సార్లు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది. బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొన్న హరితేజ బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది. కప్పు కొట్టకపోయినా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ అభిమానుల మనసులు గెల్చుకుంది. ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన హరితేజ బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ మొదటి సీజన్ హైదరాబాద్ లో జరగలేదని.. ముంబై సమీపంలోని లోనావాలాలో జరిగిందని.. అక్కడ శివారులో ఉన్న ఓ అడవిలో బిగ్ బాస్ సెట్ వేశారంటూ చెప్పుకొచ్చింది. అక్కడ రాత్రి అయితే పులుల శబ్దాలు వినిపించేవని.. అప్పుడప్పుడు హౌస్ లోకి పాములు కూడా వచ్చేవంటూ అప్పటి హార్రిబుల్ ఇన్‌సిడెంట్స్‌ను గుర్తు చేసుకుంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ షో చూడడం మానేశాను. రెండు సార్లు వెళ్లిన తర్వాత ఆ రియాలిటీ షోపై ఇంట్రెస్ట్ పోయింది. చిరాకు కూడా వచ్చేసింది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత తన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చాలా మంది తన మీద అకారణంగా ద్వేషం చూపిస్తానంటూ చెప్పుకొచ్చింది. దీంతో తాను డిప్రెషన్ బారిన పడ్డానని.. తిరిగి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టిందంటూ హరితేజ చెప్పుకొచ్చింది. ఈ కారణంగానే ఇంకోసారి తాను బిగ్ బాస్ షోకు వెళ్లదల్చుకోలేదంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.,
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nikhil Siddhartha: వెయ్యి మంది పిల్లలంటే మాటలు కాదు.. నిజంగా నిఖిల్ చాలా గ్రేట్!
B. V. Nandini Reddy: జాక్‌పాట్ కొట్టిన నందినిరెడ్డి..ఈసారి బాలీవుడ్ పై గురి!
Lenin Review: అయ్యగారి ప్రోగ్రెస్ కార్డ్ ! లెనిన్ హిట్టా.. ఫట్టా..?
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా
మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్
దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం
ప్రాచీన శివాలయానికి జాతీయ హోదా!
చైనాలో గుడ్డు కూర ధర ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ..

