ఆ హీరోతో సినిమా చేయాలంటే రాజమౌళికి కూడా టెన్షన్ ఉంటుంది.. షాకింగ్ విషయం చెప్పిన వి.వి వినాయక్
ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ఇండస్ట్రీ హిట్స్ అందించిన దర్శకుడు వివి వినాయక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాతో దర్శకుడిగా మారారు వివి వినాయక్. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

దర్శకుడు వి.వి. వినాయక్, చిరంజీవి వంటి మెగాస్టార్ సినిమాకు దర్శకత్వం వహించడం ఒక అసాధారణమైన ఒత్తిడి, పెద్ద బాధ్యత అని వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే చిరంజీవితో సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు అని వినాయక్ అన్నారు. ఇది కేవలం దర్శకుడికి మాత్రమే కాదని, నిరంతర విజయాలు సాధించిన రాజమౌళి గారి వంటి వారికి కూడా చిరంజీవి సినిమా విషయంలో టెన్షన్ ఉంటుందని ఆయన అన్నారు. ప్రేక్షకుల అంచనాలు, ఊహలు ఎప్పుడూ చాలా ఎక్కువగా ఉంటాయని, అందుకే వంద శాతం ఒత్తిడి తప్పదని వినాయక్ వివరించారు. వ్యక్తిగతంగా, తన తండ్రి జీవించి ఉన్నప్పుడు తన సినిమా డబుల్ పాజిటివ్ చూసి లోపాలను సరిదిద్దేవారని, ఇప్పుడు చిరంజీవి గారే ఆ స్థానంలో ఉండి తనకు మార్గదర్శనం చేస్తున్నారని వినాయక్ తెలిపారు.
ఇది కూడా చదవండి : కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా
పెద్ద దర్శకుడిగా తన స్థాయిని బట్టి ఎవరూ తప్పులు ధైర్యంగా చెప్పడానికి ముందుకు రారని, కానీ చిరంజీవి గారు మాత్రం ప్రతీ అంశాన్ని కూలంకషంగా పరిశీలించి వంద ప్రశ్నలకు పైగా సమాధానాలు అడుగుతారని, లాజిక్‌లు అడిగితే అవి ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉంటాయని ఆయన అన్నారు. చిరంజీవి గారు మొండిగా ఉండరని, తన అభిప్రాయాలను కన్విన్స్ చేస్తే అంగీకరిస్తారని, ఆయన ప్రతీదీ సినిమా కోసమే చేస్తారని వినాయక్ ప్రశంసించారు. కోట్లాది రూపాయలు, ఎంతో మంది వ్యక్తుల భవిష్యత్తు, కోట్లాది మంది అభిమానుల సంతోషం చిరంజీవి గారి సినిమాతో ముడిపడి ఉంటాయని ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి : ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది
దర్శకుడికి మాత్రమే కాకుండా, స్వయంగా చిరంజీవి గారికే తన సినిమా అంటే అపారమైన ఒత్తిడి ఉంటుందని, మొదటి సినిమా చేసేటప్పుడు ఉన్నంత టెన్షన్ ఆయనకి ఇప్పటికీ ఉంటుందని వినాయక్ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
ఇది కూడా చదవండి : ఆ డాన్స్ ఏంటి అమ్మడు..! హ్యాపీ రీ రిలీజ్‌లో రచ్చ చేసిన హీరోయిన్.. థియేటర్ దద్దరిల్లిందిగా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




