AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బడి బాటకు అమావాస్య గండం.. తొలిరోజు నో అడ్మిషన్లు..!

2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఘనంగా పునఃప్రారంభమైనప్పటికీ అమావాస్య సెంటిమెంట్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. పాఠశాలలను మామిడి తోరణాలు, పూలదండలతో అలంకరించి, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహార పథకంతో విద్యార్థులకు స్వాగతం పలికారు. అయితే చాలామంది తల్లిదండ్రులు అమావాస్య కారణంగా పిల్లలను బడికి పంపకపోవడంతో తరగతి గదులు వెలవెలబోయాయి. కొత్త అడ్మిషన్లను కూడా చాలామంది వాయిదా వేసుకోవడంతో తొలి రోజు పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా తగ్గింది.

బడి బాటకు అమావాస్య గండం.. తొలిరోజు నో అడ్మిషన్లు..!
Badibata
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 15, 2026 | 11:27 AM

Share

వేసవి సెలవులు ముగిశాయి. బడిగంట మోగింది. విద్యార్థుల పరుగులు, ఉపాధ్యాయుల ఆరాటం మొదలైంది. ప్రభుత్వ ప్రైవేట్ బడులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.. అల్పాహారం కొత్త పథకంతో విద్యార్థులకు గ్రాండ్ వెల్ కం చెప్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. ప్రభుత్వ స్కూళ్లను మామిడి తోరణాలు, అరిటాకులు, బంతి పూల దండలతో అలంకరించి విద్యారులకు స్వాగతం పలికారు. కానీ అమావాస్య ప్రభావంతో చాలా స్కూల్స్ విద్యార్థులు రాక వెలవెలబోయాయి.

వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 3416 ప్రభుత్వ పాఠశాలలు, 2441 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.. ఉదయాన్నే బడిగంట మోగింది.. 51 రోజుల వేసవి సెలవుల తర్వాత స్కూళ్లన్నీ పునః ప్రారంభం అయ్యాయి.. 2026-27 విద్యా సంవత్సరానికి గ్రాండ్ వెల్ కం చెపుతూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అల్పాహారం కార్యక్రమం ప్రారంభమైనది. విద్యార్థులకు ఉదయాన్నే నాణ్యమైన అల్పాహారంతో స్వాగతం పలికారు.

వీడియో చూడండి..

అయితే అమావాస్య ప్రభావంతో విద్యార్థుల సంఖ్య తొలిరోజు ఊహించని విధంగా తగ్గింది.. అమావాస్య సెంటిమెంట్ తో చాలామంది తల్లిదండ్రులు తొలిరోజు వాళ్ళ పిల్లలను పంపడానికి ఆసక్తి చూపలేదు.. దీంతో చాలా పాఠశాలల్లో అమావాస్య సెంటిమెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. తరగతి గదులు సగం కూడా నిండలేదు. వరంగల్ ఉమ్మడి జిల్లా అంతటా స్కూల్స్ రీ ఓపెన్ పై అమావాస్య సెంటిమెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని స్కూళ్లల్లో ఒక్కరి్దరే కనిపించారు.

రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలను కూడా ముస్తాబు చేసి.. విద్యార్థులను ఆహ్వానించారు. కానీ విద్యార్థులు తొలిరోజు అమావాస్య ప్రభావంతో చాలా తక్కువ సంఖ్యలో కనిపించారు. కొత్తగా విద్యార్థులను స్కూళ్లలో చేర్పించే తల్లిదండ్రులు కూడా ఈరోజు అడ్మిషన్లు వాయిదా వేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us