AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామబాణం.. ఈ ఒక్క ఆకుతో 100 రోగాలకు చెక్ పెట్టొచ్చు.. దీని పవర్ తెలిస్తే మైండ్ బ్లాంకే..

ప్రస్తుత తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆయుర్వేదం ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతోంది. ప్రకృతి మనకు అందించిన అద్భుత ఔషధ మొక్కలలో రణపాల ఒకటి. దీనిని లీఫ్ ఆఫ్ లైఫ్ అని కూడా వ్యవహరిస్తారు.. దీనికి జీవాన్నిచ్చే శక్తి ఉంది. శాస్త్రీయంగా బ్రయోఫిల్లం అని పిలువబడే ఈ మొక్క, ఆకు అంచుల నుండి స్వయంగా కొత్త మొక్కలను మొలకెత్తించగల ప్రత్యేకతను కలిగి ఉంది.

రామబాణం.. ఈ ఒక్క ఆకుతో 100 రోగాలకు చెక్ పెట్టొచ్చు.. దీని పవర్ తెలిస్తే మైండ్ బ్లాంకే..
Ranapala Plant Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: Feb 16, 2026 | 2:17 PM

Share

ఉరుకులు పరుగుల ఆధునిక కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆయుర్వేదం ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతోంది. ప్రకృతి మనకు అందించిన అద్భుత ఔషధ మొక్కలలో రణపాల ఒకటి.. రణపాల ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. ఇవి ఎన్నో సమస్యలను దూరం చేసి.. శరీరానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయి. అందుకే.. దీనిని వంద రోగాలకు ఒక్కటే ఔషధంగా వ్యవహరిస్తారు ఆయుర్వేద నిపుణులు.. రణపాల మొక్కలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇది శరీరంలో వచ్చే దాదాపుగా అన్ని రోగాలపై అద్భుతంగా పనిచేస్తుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, రక్తపోటు, మధుమేహం (డయాబెటిస్), పుండ్లు, చర్మ వ్యాధులు, వేడి పొక్కులు, గుండె వ్యాధులు, మూత్రనాళాలకు సంబంధించిన సమస్యలు, రక్త శుద్ధి, జుట్టు పటుత్వం, గ్యాస్ట్రిక్ అల్సర్లు, మోకాళ్ళ నొప్పులు, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఇలా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు రణపాల ఏకైక పరిష్కారంగా చెప్పవచ్చు. రణము అంటే శోధన, పాల అంటే దాన్ని శాసించేది అనే అర్థం.. అందుకే.. రణపాల ఆకుని లీఫ్ ఆఫ్ లైఫ్ అని కూడా పిలుస్తారు. దీనికి జీవాన్నిచ్చే శక్తి ఉంటుంది కాబట్టే ఈ పేరు వచ్చిందంటున్నారు ఆరోగ్య నిపుణులు..

శాస్త్రీయంగా దీన్ని బ్రయోఫిల్లం అని అంటుంటారు. బ్రయోఫిల్లం అంటే స్వయంగా మొలకెత్తే ఆకు అని అర్థం. ఈ ఆకుని మట్టిలో వేసినా, ఆకు అంచుల నుంచి కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి. ఈ రణపాల మొక్క 10 నుండి 15 రోజుల పాటు నీళ్ళు పోయకపోయినా కూడా వాడిపోకుండా ఉంటుంది. వీటిలో కొంత నీరు నిల్వ ఉండటం వలన వీటిని సక్కంబలెంట్ లీవ్స్ అని కూడా అంటారు. కేథడ్రల్ బెల్స్, కలాంచోయే పిన్నాటా, పత్తర్ చట్టా వంటి పేర్లతో రణపాల ఆకుని వివిధ భాషల్లో పిలుస్తుంటారు.

రణపాల ఆకు ప్రధాన ప్రయోజనాలలో ఒకటి కిడ్నీలో రాళ్లకు బ్రహ్మాస్త్రంలా పనిచేయడం. ఈ ఆకుని కషాయంలా చేసుకొని తాగితే, కిడ్నీలో రాళ్లతోపాటు మూత్రాశయంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. రణపాల ఆకుని మెత్తగా నూరి గాయాలపైన, వేడి పొక్కుల పైన పూతలా రాసుకుంటే, పుండు రెండు రోజుల్లో నయం అవుతుంది. రణపాల ఆకులపై ఉప్పు రాసి నమిలినా చాలు, ఆ రసం రక్తశుద్ధికి బాగా ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో మలినాలన్నింటినీ తొలగించడమే కాకుండా, రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కూడా తొలగించి రక్త ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తుంది.

రణపాల ఆకులను మెత్తగా నూరి జ్యూస్ లా తాగితే గ్యాస్ట్రిక్ అల్సర్లు దరిచేరవు. రణపాల ఆకుల జ్యూస్ అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. అంతేకాదు, ఈ ఆకులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అలర్జిక్, యాంటీబయాటిక్ గుణాలు కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, తలనొప్పి, మెడనొప్పి వంటి ఎటువంటి రోగానికైనా అద్భుతంగా పనిచేస్తాయి.

రణపాల ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది దాదాపు 30-40 రోగాలకు ఒక్కటే మందుగా పనిచేస్తుంది. ఈ మొక్కని మనమందరం మన ఇళ్ళల్లోనే పెంచుకోవచ్చు. ఎలాంటి నేలపై అయినా ఈ మొక్క బ్రతుకుతుంది. పెరట్లోనే ఈ మొక్కని పెంచుకుంటూ, రోజూ ఆ చెట్టు ఆకులని తింటుంటే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని ఆయుర్వేదం తెలియజేస్తోంది.

మీకు ఏమైనా సమస్యలుంటే.. రణపాల వినియోగించే ముందు.. వైద్య నిపుణులను లేదా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us