దాదాపు 95 శాతం నీటితో ఉండే కీరా దోసకాయ వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించడంలో కీలకపాత్ర పోషించి శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తుంది. ఉష్ణోగ్రతనూ నియంత్రిస్తుంది
TV9 Telugu
దీన్ని పోషకాల గనిగానూ చెప్పొచ్చు. బీ, సీ విటమిన్లూ, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలూ ఇందులో అధికమే. బరువు తగ్గాలనుకునేవారు రోజూ కీరాని తినొచ్చు
TV9 Telugu
క్యాలరీలు, పిండి పదార్థాలు, చక్కెర తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. అధిక పీచుతో ఉండే కీరా దోస జీర్ణవ్యవస్థ పనితీరుకు మేలు చేస్తుంది. ఉదర సంబంధ వ్యాధుల్నీ, మలబద్ధకాన్నీ తగ్గిస్తుంది
TV9 Telugu
శరీరంలోని ఇన్సులిన్ స్థాయుల్ని నియంత్రిస్తూ ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం వల్ల డీహైడ్రేట్ అయ్యే మధుమేహులకు దీని వల్ల ఎంతో లాభం
TV9 Telugu
మెదడును ఆరోగ్యంగా ఉంచుతూ వయసుతోపాటు వచ్చే మతిమరుపు నుంచీ ఇది కాపాడుతుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా చూడటంతోపాటు ఆ కణాల నిర్మూలనకూ కీరా ఉపయోగపడుతుంది
TV9 Telugu
సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది, పొటాషియం దీని ప్రభావాన్ని తగ్గిస్తూ రక్తపోటు పెరగకుండా చూస్తుంది. కీరాలో సోడియం తక్కువగా ఉండటం, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రెండు రకాలుగా మేలు చేస్తుందన్నమాట. ఇంకా ఇది కొలెస్ట్రాల్ మోతాదులనూ తగ్గిస్తుంది
TV9 Telugu
కీరాలో ఎక్కువగా ఉండే కె-విటమిన్ మనం తీసుకున్న ఆహారం నుంచి శరీరం ఎక్కువ మొత్తంలో కాల్షియం గ్రహించేలా చేస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి. నోటి దుర్వాసనను పోగొట్టి తాజా శ్వాసను అందించడంలో కీరా దోస బాగా పనిచేస్తుంది
TV9 Telugu
మూత్రపిండాల్లోనూ, మూత్రాశయంలోనూ ఉన్న రాళ్లను కరిగిస్తుంది. కీరా దోస శరీరంలోని వ్యర్థాల్ని తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించడంలోనూ ఇది ముందే ఉంటుంది. దీంట్లోని సిలికా, ఇతర ఖనిజాలు చర్మాన్నీ, గోళ్లనీ, జుట్టునీ ఆరోగ్యంగా ఉంచుతాయి