AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరూరించే కాకినాడ మడత కాజా.. ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలదు!

స్వీట్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా స్వీట్ తింటారు. ముఖ్యంగా కాకినాడ స్పెషల్ మడత కాజా చాలా మంది ఫేవరెట్. అయితే దీనిని ప్రతిసారీ కొనుగోలు చేసి తినలేం కదా, మరి ఈ మడత కాజాను ఇంటిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Apr 24, 2026 | 9:19 AM

Share
మడత కాజా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు : కప్పు మైదా, చిటికెడు ఉప్పు, నెయ్యి, వంట సోడా, నిమ్మరసం ఒక టీ స్పూన్, యాలకుల పొడి, చక్కెర, ఫ్రైకి సరిపడ నూనె. తయారీ విధానం : మడత కాజా అచ్చం కాకినాడ స్టైల్‌లో రావాలి అంటే తప్పకుండా కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా పిండి కలిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన కొలతలు తీసుకున్నప్పుడే ఇది పర్ఫెక్ట్‌గా వస్తుంది. దీని కోసం మందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. అందులో చిటికెడు వంట సోడా, మూడు టీ స్పూన్ల నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి.

1 / 5
పిండిని చేతితో పట్టుకుంటే ముద్దలా రావాలి అప్పుడు పిండిలో నెయ్యి మంచిగా కలిసినట్లు. దీని తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. పిండి మంచిగా కలుపుకున్న తర్వాత, దానిపై వన టీ స్పూన్ నూనె వేసి మరోసారి కలిపి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు పాకం తయారు చేసుకోవాలి : దీని కోసం మైదా పిండిని తీసుకున్న కప్పుతో ఒక కప్పుడు చక్కెర తీసుకోవాలి. తర్వాత దీనికి రెండు కప్పుల నీరు యాడ్ చేసి, పాకం తయారు చేసుకోవాలి. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మంటపై చక్కెర కరిగే వరకు మరగనివ్వాలి. చక్కెర నీరు బాగా మరిగి మరీ తీగ పాకం కాకుండా, మరీ నీటిలా కాకుండా కాస్త బంక టైప్‌లో పాకం వచ్చేలా చూసుకోవాలి.  పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, పాకంలో రెండు చుక్కల నిమ్మరసం వేసి పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం వేయడం వలన పాకం గట్టి పడకుండా ఉంటుంది.

3 / 5
దీని తర్వాత ఇప్పుడు మడత కాజాలు తయారు చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని మూడు మద్దలుగా చేసుకోవాలి. వాటిని పెద్ద చపాతీల్లా తాల్చుకోవాలి. తర్వాత ఒక దానిపై మరొకటి వేసి మళ్లీ తాల్చుకోవాలి. కాస్త పలచగా, పెద్దగా తాల్చుకున్న తర్వాత , దానిని మల్చుకుంటూ రావాలి. మలిచే క్రమంలో పిండి, కాస్త నెయ్యి రాసుకోవాలి. దీని వలన కాజాలు మంచి ఆకారంలో వస్తాయి.

4 / 5
ఇలా మలిచిన తర్వాత వాటిని కాజాలా ఆకారంలో కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ నూనె పోసుకోవాలి. తర్వాత నూనె బాగా వేడి ఎక్కిన తర్వాత కాజాలను అందులో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బంగారు రంగు వచ్చిన తర్వాత వేయించు కోవడం వలన మంచిగా క్రిస్పిగా ఉంటాయి. ఇవి వేగి తర్వాత వీటిని నూనెలో నుంచి తీసి, మనం ముందుగా తయారు చేసుకున్న చక్కెర పాకంలో వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత తింటే టేస్టీ టేస్టీ కాకినాడ స్టైల్ మడత కాజా రెడీ. మరి మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి!

5 / 5
Follow Us