AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birds and Luck: మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువచ్చే 4 పక్షులు.. తరిమేశారంటే లక్ష్మీదేవిని బయటకు పంపినట్లే..

Vastu Tips: మానవుడికి ప్రకృతిలోని ప్రతి అంశంలో ఏదో ఒక విధమైన బంధం ముడిపడి ఉంది. అందుకే మన హిందూ ధర్మంలో ప్రకృతి ఆరాధన ప్రముఖంగా చెప్పబడింది. ఇంకా మన దేవతలలో జంతురూపాలే కాక గద్ద, గుడ్లగూబ, కాకి, నెమలి వంటివి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రకాల పక్షలు ఇంటికి వచ్చి పరిసరాలలో..

Birds and Luck: మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువచ్చే 4 పక్షులు.. తరిమేశారంటే లక్ష్మీదేవిని బయటకు పంపినట్లే..
Birds And Vastu
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 18, 2023 | 8:12 AM

Share

Vastu Tips: మానవుడికి ప్రకృతిలోని ప్రతి అంశంలో ఏదో ఒక విధమైన బంధం ముడిపడి ఉంది. అందుకే మన హిందూ ధర్మంలో ప్రకృతి ఆరాధన ప్రముఖంగా చెప్పబడింది. ఇంకా మన దేవతలలో జంతురూపాలే కాక గద్ద, గుడ్లగూబ, కాకి, నెమలి వంటివి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రకాల పక్షలు ఇంటికి వచ్చి పరిసరాలలో సంచరించడం చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవును, వాస్తు శాస్త్రం ప్రకారం కంటికి కనిపించని ప్రతికూల శక్తులను, పరిస్థితులను ఇంటి నుంచి తొలగించడానికి పక్షులు ఉపయోగపడతాయి. ఇంకా ఇంటికి సానుకూల పరిస్థితిని తీసుకురావడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయంట. ఈ కారణంగానే వాటిని అదృష్ట పక్షులుగా అభివర్ణిస్తున్నారు వాస్తు నిపుణులు. ఇంతకీ ఆ అదృష్ట పక్షులేమిటో ఇప్పుడు చూద్దాం..

పాల పిట్ట: వాస్తు శాస్త్రం ప్రకారం పాల పిట్ట ఇంటికి రావడం ఎంతో శుభప్రదం. నీలి రంగులో ఉండే ఈ పక్షి అదృష్టానికి వారథిగా పనిచేస్తుందంట. ముఖ్యంగా ఈ పక్షి దసరా సమయంలో ఇంటి ఛాయలకు వచ్చినా లక్ష్మీకటాక్షం లభిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

గుడ్లగూబ: శ్రీమహాలక్ష్మికి వాహనమైన గుడ్లగూబ కూడా అదృష్టానికి సంకేతమే. చాలా మంది గూడ్లగూబ కనపించగానే భయపడడం, విసుక్కొవడం చేస్తారు. కానీ  గుడ్లగూబ ఇంటికి వచ్చిన అనతికాలంలోనే కుటుంబసభ్యులకు ఆదాయం, ఆస్తులు పెరిగేలా చేస్తుందని పెద్దలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

చిలుక: వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం.. చిలుక యాదృచికంగా మీ ఇంటికి వచ్చి కాసేపు కూర్చుంటే, మీకు ఊహించని రీతిలో ధనం వస్తుందని సంకేతం.

కాకి: చాలా మంది కాకి కనిపించగానే తరిమేస్తారు. లేదా ఎక్కడో ఉండి అరిస్తే ఇంటికి బంధువుల రాకకు సంకేతంగా భావిస్తారు. అయితే పూర్వికులు కాకి రూపంలో ఇంటి చుట్టూ తిరుగుతుంటారని పెద్దలు చెబుతుంటారు. పైగా కాకి శనిదేవుడి వాహనం. కాకి ఉందంటే శనిదేవుడు మీపై అనుగ్రహంతో ఉన్నాడని అర్థమంట.

పక్షి గూడు: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పక్షి గూడు కట్టుకుంటే.. త్వరలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందని సంకేతం. ఇది పిల్లల పుట్టుకను కూడా సూచిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..