Funny Video: మరీ ఇలా తయారయ్యారేంట్రా..! లైకుల కోసం మార్కెట్‌లో డ్యాన్స్.. స్థానికుల రియాక్షన్ ఏమిటంటే..?

Dance Video: చాలా మంది యువతీయువకులు సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని.. ఎన్నో రకాల విన్యాసాలు చేస్తున్నారు. ఇంకా అందుకు సంబంధించిన వీడియోలను నెట్టింట షేర్ చేసి నానాపాట్లు పడుతున్నారు. అలాంటి ప్రయత్నమే చేసిన ఓ యువకుడి వీడియో..

Funny Video: మరీ ఇలా తయారయ్యారేంట్రా..! లైకుల కోసం మార్కెట్‌లో డ్యాన్స్.. స్థానికుల రియాక్షన్ ఏమిటంటే..?
Youngster Dancing Visuals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 16, 2023 | 7:30 AM

Dance Video: చాలా మంది యువతీయువకులు సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని.. ఎన్నో రకాల విన్యాసాలు చేస్తున్నారు. ఇంకా అందుకు సంబంధించిన వీడియోలను నెట్టింట షేర్ చేసి నానాపాట్లు పడుతున్నారు. అలాంటి ప్రయత్నమే చేసిన ఓ యువకుడి వీడియో ప్రస్తుతం నెట్టింట వైలర్ అవుతోంది. ఆ వీడియోలోని యువకుడు ఢిల్లీలోని స్థానిక మార్కెట్‌లో ఉన్నట్లుండి డ్యాన్స్ వేయడం ప్రారంభిస్తాడు. దాన్ని చూసిన అక్కడివారు ‘వీడికి పిచ్చి పట్టిందా..?’ అన్నట్లుగా చూస్తుండిపోయారు. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు కూడా నవ్వుకోవడంతో పాటు రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు.

viralbhayani అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. సోషల్ మీడియాలో పాపులర్ కావాలంటే ఇలా కష్టపడాల్సిందే అంటున్నారు. అలాగే ‘లైకులు కోసం ఇంత హడావుడి అవసరమా..’, ‘ఉన్నట్లుండి అందరినీ భయపెట్టావు కదారా..’, ‘నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ సూపర్ బ్రో’ అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ‘వీడియోలోని వాడి డ్యాన్స్ ఏమో కానీ, చుట్టు పక్కలవారి రియాక్షన్ సూపర్’ అని రాసుకొచ్చాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..